Telugu Global
Others

రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై చ‌ర్చ‌కు పార్ల‌మెంటులో విప‌క్షం ప‌ట్టు

పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి దేశంలో జ‌రుగుతున్న రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై చ‌ర్చ‌ను చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. స‌భ‌లు ప్రారంభ‌మైన వెంట‌నే దీనిపై కాంగ్రెస్ పార్టీతోపాటు విప‌క్షాలు వాయిదా తీర్మానం నోటీసులిచ్చాయి. వీటిని స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ తోసిపుచ్చారు. ఆప్ ర్యాలీలో రాజ‌స్థాన్‌కు చెందిన‌ రైతు గ‌జేంద్ర‌సింగ్‌ ఆత్మహ‌త్య‌పై చ‌ర్చ‌కు కూడా కాంగ్రెస్ ప‌ట్టుబ‌ట్టింది దీనిపై చాలా సేపు గంద‌ర‌గోళం జ‌రిగింది. తాము చ‌ర్చ‌కు సిద్ధ‌మేన‌ని అయితే దీనికి ఓ ప‌ద్ధ‌తి ఉండాల‌ని […]

పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి దేశంలో జ‌రుగుతున్న రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై చ‌ర్చ‌ను చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. స‌భ‌లు ప్రారంభ‌మైన వెంట‌నే దీనిపై కాంగ్రెస్ పార్టీతోపాటు విప‌క్షాలు వాయిదా తీర్మానం నోటీసులిచ్చాయి. వీటిని స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ తోసిపుచ్చారు. ఆప్ ర్యాలీలో రాజ‌స్థాన్‌కు చెందిన‌ రైతు గ‌జేంద్ర‌సింగ్‌ ఆత్మహ‌త్య‌పై చ‌ర్చ‌కు కూడా కాంగ్రెస్ ప‌ట్టుబ‌ట్టింది దీనిపై చాలా సేపు గంద‌ర‌గోళం జ‌రిగింది. తాము చ‌ర్చ‌కు సిద్ధ‌మేన‌ని అయితే దీనికి ఓ ప‌ద్ధ‌తి ఉండాల‌ని కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు అన్నారు. ఢిల్లీలో ఇలాంటి సంఘ‌ట‌నలు జ‌ర‌గ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని అంటూ దీనిపై హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఆయ‌న అన్నారు. అస‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌పైనే కాకుండా రైతుల మొత్తం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వెంక‌య్య‌నాయుడు అన్నారు. రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌ను రాజ‌కీయం చేయ‌డం మంచిది కాద‌ని ఆయ‌న అన్నారు. వెంకయ్య‌నాయుడు స‌మాధానంతో సంతృప్తి చెంద‌ని విప‌క్షాలు స్పీక‌ర్ పొడియం వ‌ద్ద‌కు పోయి చ‌ర్చ‌కు డిమాండు చేస్తూ ధ‌ర్నాకు దిగారు. అయినా స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యుల నుంచి ప్ర‌శ్న‌లు స్వీక‌రించ‌డంతో కాంగ్రెస్ స‌భ్యులు తీవ్రంగా నినాదాలు చేస్తూ స‌భ‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ప‌రిస్థితుల్లో చేసేదేమీ లేక స్పీక‌ర్ స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేసి వెళ్ళిపోయారు.
Next Story