కూతురి నిర్వాకానికి తండ్రి ఆత్మహత్య!
చిత్తూరు జిల్లా సత్యవీడులో దారుణం జరిగిపోయింది. చీటీల పేరుతో కూతురు చేసిన నిర్వాకానికి తండ్రి బలైపోయాడు. సత్యవీడులో ఓక మహిళ చీటీల పేరుతో దాదాపు కోటి రూపాయల లావాదేవీలు నడిపింది. చీటీలు పాడుకున్న వారు సకాలంలో తిరిగి కట్టకపోవడంతో ఆ మహిళ సమస్యల్లో పడిపోయింది. దీంతో ఎవరికీ కనిపించకుండా బెంగుళూరు వెళ్ళిపోయింది. సత్యవీడులోనే ఉంటున్న ఆ మహిళ తండ్రిని చీటిలు వేసిన వారు నిలదీయడం ప్రారంభించారు. ఇది క్రమంగా అతని మీద ఒత్తిడి చేయడం దాకా వచ్చింది. […]
BY Pragnadhar Reddy22 April 2015 7:40 PM GMT
Pragnadhar Reddy22 April 2015 7:40 PM GMT
చిత్తూరు జిల్లా సత్యవీడులో దారుణం జరిగిపోయింది. చీటీల పేరుతో కూతురు చేసిన నిర్వాకానికి తండ్రి బలైపోయాడు. సత్యవీడులో ఓక మహిళ చీటీల పేరుతో దాదాపు కోటి రూపాయల లావాదేవీలు నడిపింది. చీటీలు పాడుకున్న వారు సకాలంలో తిరిగి కట్టకపోవడంతో ఆ మహిళ సమస్యల్లో పడిపోయింది. దీంతో ఎవరికీ కనిపించకుండా బెంగుళూరు వెళ్ళిపోయింది. సత్యవీడులోనే ఉంటున్న ఆ మహిళ తండ్రిని చీటిలు వేసిన వారు నిలదీయడం ప్రారంభించారు. ఇది క్రమంగా అతని మీద ఒత్తిడి చేయడం దాకా వచ్చింది. గురువారం తండ్రి దగ్గరకు వచ్చిన బాధితులు అతన్ని నిలదీసి కూతురి జాడ చెప్పమన్నారు. ఆయన తనకేమీ తెలియదని చెప్పడంతో బాధితులంతా చితకబాదారు. ఇది అవమానంగా ఫీలయిన తండ్రి ఇంట్లోకెళ్ళి ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story