Telugu Global
Cinema & Entertainment

ఒక్కసారిగా హాట్ అయిపోయింది

సోనారికా.. ఈ పేరు తెలుగులో ఎవరికీ తెలియదు. ఈ అమ్మడు కేవలం ఒకేఒక్క సినిమా చేసింది. అది కూడా ఈరోజు రిలీజ్ అవుతోంది. ఆ సినిమాలో కూడా స్టార్ హీరో లేడు. అదే జాదూగాడు. అయితేనేం సోనారికా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. దీనికి కారణం అల్లు అర్జున్. అవును.. తన రెండో సినిమాకే బన్నీ సరసన ఛాన్స్ కొట్టేయడంతో అంతా ఇప్పుడు సోనారికా గురించే మాట్లాడుకుంటున్నారు. జాదూగాడు లాంటి […]

ఒక్కసారిగా హాట్ అయిపోయింది
X
సోనారికా.. ఈ పేరు తెలుగులో ఎవరికీ తెలియదు. ఈ అమ్మడు కేవలం ఒకేఒక్క సినిమా చేసింది. అది కూడా ఈరోజు రిలీజ్ అవుతోంది. ఆ సినిమాలో కూడా స్టార్ హీరో లేడు. అదే జాదూగాడు. అయితేనేం సోనారికా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. దీనికి కారణం అల్లు అర్జున్. అవును.. తన రెండో సినిమాకే బన్నీ సరసన ఛాన్స్ కొట్టేయడంతో అంతా ఇప్పుడు సోనారికా గురించే మాట్లాడుకుంటున్నారు. జాదూగాడు లాంటి చిన్న సినిమా చేసిన సోనారికాకు బన్నీ లాంటి పెద్ద స్టార్ సరసన ఎలా అవకాశం వచ్చిందా అంటూ ఆరాలు తీస్తున్నారు. నిజమే బన్నీ లాంటి బిగ్ స్టార్ పక్కన ఓ చిన్న హీరోయిన్ కు, అందులోనూ టీవీ సీరియళ్లు చేసుకునే అమ్మయికి ఛాన్స్ రావడం నిజంగా గొప్ప విషయమే. కానీ సోనారికా మాత్రం బన్నీ సరసన ఛాన్స్ కోసం తెరవెనక ఎంత చేయాలో అంతా చేసింది. బన్నీకి ఉన్న బాలీవుడ్ రిలేషన్స్ కనుక్కొని, తనకు తెలిసిన వాళ్ల ద్వారా అతడికి ఫోన్ చేయించింది. మరోవైపు దర్శకుడు బోయపాటి శ్రీనుతో కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు కొత్తకొత్త పోర్టుపోలియోలు పంపిస్తూ ఉండేది. అలా దాదాపు 4 నెలల పాటు ప్రయత్నించిన తర్వాత మాత్రమే అల్లు అర్జున్ సరసన ఛాన్స్ సంపాదించగలిగింది సోనారికా.
First Published:  22 April 2015 10:56 PM GMT
Next Story