బాల నేరస్థుల చట్టంలో మార్పులు
న్యూఢిల్లీ: బాల నేరస్థుల చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయదలచింది. ఇంతకుముందు 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారిని బాల నేరస్థులుగా పరిగణించి వారికి శిక్షలు ఖరారు చేసేవారు. పెద్దల మాదిరిగానే నేరం తీవ్రంగా ఉన్నప్పటికీ బాలలన్న ఏకైక కారణంతో ఏదో మొక్కుబడిగా శిక్షలు విధించేవారు. ఇది సమాజంలో చెడు ప్రభావం చూపుతున్నట్టు కేంద్ర గమనించింది. 15, 16 సంవత్సరాల వయస్సులోనే పిల్లలు అత్యాచారాలకు పాల్పడడం, పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడడం చేస్తున్నారు. అయినా బాలలన్న కారణంతో […]
న్యూఢిల్లీ: బాల నేరస్థుల చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయదలచింది. ఇంతకుముందు 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారిని బాల నేరస్థులుగా పరిగణించి వారికి శిక్షలు ఖరారు చేసేవారు. పెద్దల మాదిరిగానే నేరం తీవ్రంగా ఉన్నప్పటికీ బాలలన్న ఏకైక కారణంతో ఏదో మొక్కుబడిగా శిక్షలు విధించేవారు. ఇది సమాజంలో చెడు ప్రభావం చూపుతున్నట్టు కేంద్ర గమనించింది. 15, 16 సంవత్సరాల వయస్సులోనే పిల్లలు అత్యాచారాలకు పాల్పడడం, పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడడం చేస్తున్నారు. అయినా బాలలన్న కారణంతో వీరిపై కఠిన శిక్షలు అమలు చేయలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది తీవ్ర నేరాలకు పాల్పడిన వారు కూడా లబ్ధి పొందుతున్నారు. చట్టంలో ఉన్న బలహీనతలే వారికి బలంగా మారుతున్నాయి. అందుచేత కఠిన శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చాలని గత కొన్ని సంవత్సరాలుగా భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఇపుడు ఈ చట్టంలో మార్పులు చేయనున్నారు. నేరస్థుల వయస్సు 16 సంవత్సరాల లోపు ఉంటేనే బాల నేరస్థులుగా పరిగణించాలని కేంద్రం ఈ చట్టంలో సూచించింది. పైగా నేర తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేయాలని కూడా అందులో పేర్కొంది.