బిఎస్ఎన్ఎల్ ఫ్రీ ఆఫర్
అతిపెద్ద ల్యాండ్‌లైన్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న భారతీయ సంచార నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఇపుడు కొత్త ఆఫర్ ప్రకటించింది. ఇది నిజంగా బంపర్ ఆఫరే. వినియోగదారులు ఇంకే ల్యాండ్‌లైన్‌కు వెళ్ళకుండా ఉండేందుకు అనువుగా అపరిమిత ఆఫర్‌ను ఇచ్చింది. ఇంతకీ ఏమిటనే కదా మీ డౌట్!. దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కయినా ల్యాండ్‌లైన్ ఫోన్ ఉన్నవారికి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత అపరిమిత కాల్స్ చేసుకోవచ్చన్నది ఈ ఆఫర్ సారాంశం. ఈ […]
BY Pragnadhar Reddy23 April 2015 4:52 AM GMT

X
Pragnadhar Reddy23 April 2015 4:52 AM GMT
అతిపెద్ద ల్యాండ్‌లైన్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న భారతీయ సంచార నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఇపుడు కొత్త ఆఫర్ ప్రకటించింది. ఇది నిజంగా బంపర్ ఆఫరే. వినియోగదారులు ఇంకే ల్యాండ్‌లైన్‌కు వెళ్ళకుండా ఉండేందుకు అనువుగా అపరిమిత ఆఫర్‌ను ఇచ్చింది. ఇంతకీ ఏమిటనే కదా మీ డౌట్!. దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కయినా ల్యాండ్‌లైన్ ఫోన్ ఉన్నవారికి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత అపరిమిత కాల్స్ చేసుకోవచ్చన్నది ఈ ఆఫర్ సారాంశం. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. దీనికి ఎటువంటి ఛార్జీలు ఉండవని, ఏ నెట్‌వర్క్‌కైనా కాల్స్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ల్యాండ్‌లైన్ల కోసం ఏ ఇతర నెట్‌వర్క్‌కు వెళ్ళకుండా చేయడమే ఈ ఆఫర్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
Next Story