Telugu Global
Others

ఐఎఎస్ లు మా మాట వినటంలేదు...?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇన్‌ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న‌ర్ల‌కు, ఐ.ఎ.ఎస్‌.ల‌కు మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కు జ‌రుగుతున్న కోల్డ్‌వార్ కాస్తా ఇపుడు ర‌చ్చ‌కెక్కింది. తాము స‌క్ర‌మంగా ప‌ని చేయ‌డానికి ఐ.ఎ.ఎస్‌. అధికారులు స‌హ‌క‌రించ‌డం లేద‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఐ.ఎ.ఎస్‌.లంతా కుమ్మ‌క్కై త‌మ‌కు స‌మాచారం అంద‌కుండా చేస్తున్నార‌ని వారు ఆరోపించారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన వారిలో చీఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ కమిష‌న‌ర్‌, మ‌రో న‌లుగురు క‌మిష‌న‌ర్లు ఉన్నారు. తాము అడిగిన వివ‌రాలు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే కాకుండా స‌మాచారం కోసం తాము చేసిన‌ రిక‌మండేష‌న్ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని […]

ఐఎఎస్ లు మా మాట వినటంలేదు...?
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇన్‌ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న‌ర్ల‌కు, ఐ.ఎ.ఎస్‌.ల‌కు మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కు జ‌రుగుతున్న కోల్డ్‌వార్ కాస్తా ఇపుడు ర‌చ్చ‌కెక్కింది. తాము స‌క్ర‌మంగా ప‌ని చేయ‌డానికి ఐ.ఎ.ఎస్‌. అధికారులు స‌హ‌క‌రించ‌డం లేద‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఐ.ఎ.ఎస్‌.లంతా కుమ్మ‌క్కై త‌మ‌కు స‌మాచారం అంద‌కుండా చేస్తున్నార‌ని వారు ఆరోపించారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన వారిలో చీఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ కమిష‌న‌ర్‌, మ‌రో న‌లుగురు క‌మిష‌న‌ర్లు ఉన్నారు. తాము అడిగిన వివ‌రాలు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే కాకుండా స‌మాచారం కోసం తాము చేసిన‌ రిక‌మండేష‌న్ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు ఆరోపించారు.

Next Story