Telugu Global
Cinema & Entertainment

పెద్ద మనసు చాటుకున్న మహేష్

కొందరు చేసిన సహాయానికి పబ్లిసిటీ కోరుకుంటారు. మరికొందరు ఈ చేత్తో చేసిన దానాన్ని ఆ చేతికి కూడా తెలియనీరు. అలాంటి కోవకే వస్తాడు మహేష్. తను సంపాదించినదాంట్లో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇచ్చేస్తుంటాడు సూపర్ స్టార్. మరీ ముఖ్యంగా కష్టాల్లో ఉన్న పిల్లల్ని చూసి ఊరుకోలేడు. అందుకే ఎక్కువగా చిన్నారుల సంక్షేమం కోసం ఖర్చుపెడుతుంటాడు. ఇప్పటికే ఓ చిల్డ్రన్ హాస్పిటల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న మహేష్, ఇప్పుడో చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు […]

పెద్ద మనసు చాటుకున్న మహేష్
X

కొందరు చేసిన సహాయానికి పబ్లిసిటీ కోరుకుంటారు. మరికొందరు ఈ చేత్తో చేసిన దానాన్ని ఆ చేతికి కూడా తెలియనీరు. అలాంటి కోవకే వస్తాడు మహేష్. తను సంపాదించినదాంట్లో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇచ్చేస్తుంటాడు సూపర్ స్టార్. మరీ ముఖ్యంగా కష్టాల్లో ఉన్న పిల్లల్ని చూసి ఊరుకోలేడు. అందుకే ఎక్కువగా చిన్నారుల సంక్షేమం కోసం ఖర్చుపెడుతుంటాడు. ఇప్పటికే ఓ చిల్డ్రన్ హాస్పిటల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న మహేష్, ఇప్పుడో చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు భారీ విరాళమిచ్చాడు. హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్ కు ఏకంగా కోటిన్నర రూపాయలు విరాళంగా ఇచ్చాడు మహేష్. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయిస్తుంది ఈ సంస్థ. కొన్ని నెలలుగా ఈ సంస్థ పనితీరును నిశితంగా గమనిస్తున్నాడు మహేష్. వాళ్లు చేసిన సేవలకు మెచ్చి కోటి 50లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించాడు. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న మరింత మంది పేద చిన్నారులకు వైద్య సదుపాయం అందుతుంది.

First Published:  22 April 2015 12:08 AM GMT
Next Story