Telugu Global
Others

భార్య తిట్టిందని ఆత్మహత్య

నల్గొండ జిల్లా పెద్దవూరలో భార్య తిట్టిందని ఓ భర్త వురేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రమావత్ రాము, లక్ష్మిలకు చెందిన పెద్ద కుమారుడు నాగు (32) లారీ క్లీనర్ గా పని చేస్తుండేవాడు. వచ్చిన జీతాన్ని దుబారాగా ఖర్చు చేస్తున్నాడని భార్య జ్యోతి మంగళవారం ఉదయం తీవ్రంగా మందలించింది. దాంతో మనస్థాపం చెందిన నాగు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  సాగర్ ఏరియా ఆసుపత్రిలో నాగు […]

నల్గొండ జిల్లా పెద్దవూరలో భార్య తిట్టిందని ఓ భర్త వురేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రమావత్ రాము, లక్ష్మిలకు చెందిన పెద్ద కుమారుడు నాగు (32) లారీ క్లీనర్ గా పని చేస్తుండేవాడు. వచ్చిన జీతాన్ని దుబారాగా ఖర్చు చేస్తున్నాడని భార్య జ్యోతి మంగళవారం ఉదయం తీవ్రంగా మందలించింది. దాంతో మనస్థాపం చెందిన నాగు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాగర్ ఏరియా ఆసుపత్రిలో నాగు భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. నాగు తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story