యాజమాన్యానికి ఆర్టీసీ డెడ్‌లైన్
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలతో సమానమైన వేతనాలు తమకు ఇవ్వకపోతే సమ్మె బాట పట్టడం ఖాయమని ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు స్పష్టం చేశారు. చర్చల కోసం ఆర్టీసీ లేబర్ కమిషనర్ వద్దకు వచ్చిన వారు యాజమాన్య వైఖరిని తప్పు పట్టారు. వారం రోజుల్లో తమ నిర్ణయం చెబుతామన్న యాజమాన్య ప్రతినిధులు మౌనం దాల్చడంలో అర్ధం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ వర్తింప చేస్తున్నప్పుడు తమ వద్దకు వచ్చేసరికి కష్టాలు, నష్టాలు […]
BY Pragnadhar Reddy22 April 2015 12:29 AM GMT
Pragnadhar Reddy22 April 2015 12:29 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలతో సమానమైన వేతనాలు తమకు ఇవ్వకపోతే సమ్మె బాట పట్టడం ఖాయమని ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు స్పష్టం చేశారు. చర్చల కోసం ఆర్టీసీ లేబర్ కమిషనర్ వద్దకు వచ్చిన వారు యాజమాన్య వైఖరిని తప్పు పట్టారు. వారం రోజుల్లో తమ నిర్ణయం చెబుతామన్న యాజమాన్య ప్రతినిధులు మౌనం దాల్చడంలో అర్ధం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ వర్తింప చేస్తున్నప్పుడు తమ వద్దకు వచ్చేసరికి కష్టాలు, నష్టాలు గుర్తుకు రావడంలో అర్ధం లేదని వారన్నారు. ఈనెలాఖరు వరకు అంటే ఈనెల 30 వరకు గడువు ఇస్తామని, ఈలోగా కార్మిక అనుకూల నిర్ణయం తీసుకోకపోతే మే 6వ తేదీ నుంచి సమ్మె బాట పట్టడం ఖాయమని వారు తెలిపారు.
Next Story