Telugu Global
Others

రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊర‌ట‌

హైద‌రాబాద్‌: హ‌ఐకో హైకోర్టులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఊర‌ట ల‌భించింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావుపై తాను అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని, కేవ‌లం రాజ‌కీయ దురుద్దేశంతోనే త‌నపై కేసు పెట్టార‌ని రేవంత్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌నను వేధించే ఉద్దేశ్యంతో నాంప‌ల్లి కోర్టులో కేసు వేశార‌ని, ఈ కేసును కొట్టివేయాల్సిందిగా ఆదేశించాల‌ని కోరుతూ హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై న్యాయ‌మూర్తి స్టే ఇచ్చారు. గ‌తంలో కేసు విచార‌ణ స‌మ‌యంలో రేవంత్ […]

రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊర‌ట‌
X
హైద‌రాబాద్‌: హ‌ఐకో హైకోర్టులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఊర‌ట ల‌భించింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావుపై తాను అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని, కేవ‌లం రాజ‌కీయ దురుద్దేశంతోనే త‌నపై కేసు పెట్టార‌ని రేవంత్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌నను వేధించే ఉద్దేశ్యంతో నాంప‌ల్లి కోర్టులో కేసు వేశార‌ని, ఈ కేసును కొట్టివేయాల్సిందిగా ఆదేశించాల‌ని కోరుతూ హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై న్యాయ‌మూర్తి స్టే ఇచ్చారు. గ‌తంలో కేసు విచార‌ణ స‌మ‌యంలో రేవంత్ నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రు కాలేదు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఇలాగైతే అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. దీన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న రేవంత్ ఈ కేసును కొట్టివేయాల‌ని ఆదేశించాల్సిందిగా హైకోర్టును ఆశ్ర‌యించారు. దీన్ని విచార‌ణ‌కు స్వీక‌రించిన న్యాయ‌మూర్తి… నాంప‌ల్లి కోర్టు విచార‌ణ‌పై స్టే ఇచ్చారు.
Next Story