Telugu Global
Others

బావిలో సుమో.. బయటపడ్డ ఎర్రచందనం

చిత్తూరు: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సీతారాంపేట వద్ద ఓ బావిలో పడి ఉన్న సుమో నుంచి ఎర్ర చంద‌నం స్వాధీనం చేసుకున్నారు. ఈ సుమో బావిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి వాహనాన్ని బయటకు తీయ‌గా అందులో 17 ఎర్రచందనం దుంగలు బయటపడడంతో అవాక్కయ్యారు. వారం రోజుల క్రితమే ఇది బావిలో పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఏపీ ప్రభుత్వం దాడులు ఉక్కుపాదం మోపడం, పోలీసులు విస్తృతంగా తనిఖీలు […]

చిత్తూరు: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సీతారాంపేట వద్ద ఓ బావిలో పడి ఉన్న సుమో నుంచి ఎర్ర చంద‌నం స్వాధీనం చేసుకున్నారు. ఈ సుమో బావిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి వాహనాన్ని బయటకు తీయ‌గా అందులో 17 ఎర్రచందనం దుంగలు బయటపడడంతో అవాక్కయ్యారు. వారం రోజుల క్రితమే ఇది బావిలో పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఏపీ ప్రభుత్వం దాడులు ఉక్కుపాదం మోపడం, పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుండడంతో భయపడిన దొంగలు ఎర్రచందనం తరలిస్తున్న సుమోను బావిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. వాహనం తమిళనాడులో రిజిస్ట్రేష‌న్ కావడంతో వారి అనుమానాలు బలపడుతున్నాయి.
Next Story