Telugu Global
Others

1.5 కిలోల బంగారం స్వాధీనం... మహిళ అరెస్టు

చెన్నై: సింగపూర్ చెన్నై వచ్చిన విమానంలో చట్టవిరుద్దంగా తరలించిన 1.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణం చేసినవారి లగేజీని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. తిరుచ్చికి చెందిన అమిన బివీ సూట్‌కేస్‌ను తనిఖీ చేసిన సమయంలో అందులో దాచిన 1.5 కిలోల బంగారం ఉండ‌డాన్న‌ి అధికారులు గుర్తించారు. దానికి ఎటువంటి రసీదులు లేనందువల్ల ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు అమిన బివీని అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో […]

చెన్నై: సింగపూర్ చెన్నై వచ్చిన విమానంలో చట్టవిరుద్దంగా తరలించిన 1.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణం చేసినవారి లగేజీని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. తిరుచ్చికి చెందిన అమిన బివీ సూట్‌కేస్‌ను తనిఖీ చేసిన సమయంలో అందులో దాచిన 1.5 కిలోల బంగారం ఉండ‌డాన్న‌ి అధికారులు గుర్తించారు. దానికి ఎటువంటి రసీదులు లేనందువల్ల ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు అమిన బివీని అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.50 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
First Published:  20 April 2015 11:17 PM GMT
Next Story