ముఫ్తికి శరద్‌యాదవ్ గాలం?
జనతా పరివార్ ఛత్రం కిందకు మారిన శరద్ యాదవ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌కు గాలం వేసే పనిలో పడ్డట్టున్నారు. కాశ్మీర్‌లో తీవ్రవాదులకు ముఫ్తీ అండగా నిలుస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో దీనికి భిన్నమైన పార్శ్వాన్ని శరద్ యాదవ్ ఆవిష్కరించారు. పాలనా పరంగా ముఫ్తీకి గనుక స్వేచ్ఛనిస్తే దశాబ్దాలుగా నలుగుతున్న కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపగలరని చెప్పారు. ఆయనొక జాతీయవాది… దేశం కోసం జీవిస్తారు. మరణిస్తారు. సుదీర్ఘకాలంగా ఆయన నాకు మంచి స్నేహితుడు. సమస్యకు చక్కని పరిష్కారం […]
BY Pragnadhar Reddy20 April 2015 2:31 AM GMT

X
Pragnadhar Reddy20 April 2015 2:31 AM GMT
జనతా పరివార్ ఛత్రం కిందకు మారిన శరద్ యాదవ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌కు గాలం వేసే పనిలో పడ్డట్టున్నారు. కాశ్మీర్‌లో తీవ్రవాదులకు ముఫ్తీ అండగా నిలుస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో దీనికి భిన్నమైన పార్శ్వాన్ని శరద్ యాదవ్ ఆవిష్కరించారు. పాలనా పరంగా ముఫ్తీకి గనుక స్వేచ్ఛనిస్తే దశాబ్దాలుగా నలుగుతున్న కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపగలరని చెప్పారు. ఆయనొక జాతీయవాది… దేశం కోసం జీవిస్తారు. మరణిస్తారు. సుదీర్ఘకాలంగా ఆయన నాకు మంచి స్నేహితుడు. సమస్యకు చక్కని పరిష్కారం కనుగొనగల సమర్ధుడు. ఆయనతో నాకున్న పరిచయం రాజకీయపరమైనది కాదు. అన్ని విషయాలను మాట్లాడుకుంటాం… అని ఆయన చెప్పుకొచ్చారు. నిజంగా ముఫ్తీ మీద ఆయనకు గత సదభిప్రాయమో… లేక భవిష్యత్ రాజకీయ అవసరమో శరద్ యాదవ్‌కే తెలియాలి!-పీఆర్
Next Story