Telugu Global
Others

వీధి కుక్కలను చంపేందుకు ఆదేశాలు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీల పరిధిలో లైసెన్స్‌లేని కుక్కలను చంపేయాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ బి.రామాంజనేయులు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. లైసెన్స్‌ లేని కుక్కలను నియంత్రించే అధికారం పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పంచాయతీలకుందని తెలిపారు. వీధి కుక్కల బెడదను నివారించే విషయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించారు. కుక్క కాటుతో గాయపడిన, మరణించిన వారి వివరాలను ప్రతి వారం పంపాలని ఆయన పేర్కొన్నారు. వీధుల్లో కనిపించే అలాంటి కుక్కలను అదుపులోకి తీసుకుని ఎన్జీవోలకు అప్పగించవచ్చని, […]

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీల పరిధిలో లైసెన్స్‌లేని కుక్కలను చంపేయాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ బి.రామాంజనేయులు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. లైసెన్స్‌ లేని కుక్కలను నియంత్రించే అధికారం పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పంచాయతీలకుందని తెలిపారు. వీధి కుక్కల బెడదను నివారించే విషయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించారు. కుక్క కాటుతో గాయపడిన, మరణించిన వారి వివరాలను ప్రతి వారం పంపాలని ఆయన పేర్కొన్నారు. వీధుల్లో కనిపించే అలాంటి కుక్కలను అదుపులోకి తీసుకుని ఎన్జీవోలకు అప్పగించవచ్చని, అలా వీలుకాని పరిస్థితుల్లో సెక్షన్‌ 92 ప్రకారం తగిన‌ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
Next Story