Telugu Global
Others

ఏరుదాటాక తెప్ప త‌గ‌లేసిన బాబు, కేసీఆర్‌:: మందకృష్ణ

బిజినేపల్లి: ప్రత్యేక రాష్ట్ర సాధన ఫలాలు దళితులకు అందినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం సాధించిన వారమ‌వుతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లిలో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా అక్కడ చంద్రబాబు, ఇక్క డ కేసీఆర్‌ ఎమ్మార్పీఎస్‌ నాయకులను వాడుకుని వదిలేశారని అన్నారు. 23న జిల్లాకు ఏపీ సీఎం చంద్రబాబు వస్తున్నారని, ఆయన పాల్గొనే సమావేశాన్ని అడ్డుకుని నిరసన తెలుపుతామన్నారు.

manda-krishna-madiga
X

Next Story