Telugu Global
Others

రైతుల ఆనంద‌మే దేశానికి ఆహ్లాదం: రాహుల్‌

దేశం స‌స్య‌శ్యామ‌లంగా ఉండాలంటే రైతుల ముఖాలు క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండాల‌ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని కిసాన్ ర్యాలీలో మాట్లాడుతూ… ప్ర‌భుత్వం పారిశ్రామిక వేత్త‌ల‌కు దాసోహం అవుతూ అన్న‌దాత‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు. దేశంలో శ‌క్తిమంతులు వ్యాపారులు కాద‌ని, రైతులేన‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలుసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ఈ ప్ర‌భుత్వం రైతుల్ని ప‌ట్టించుకోవ‌డం మానేసింద‌ని… ఎప్ప‌డూ విదేశాల్లో తిరుగుతూ ఆకాశంలో నిచ్చెన‌లేస్తూ ప్ర‌ధాని మోడి కాలం గ‌డిపేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. యూపీఏ హ‌యాంలో […]

రైతుల ఆనంద‌మే దేశానికి ఆహ్లాదం: రాహుల్‌
X
దేశం స‌స్య‌శ్యామ‌లంగా ఉండాలంటే రైతుల ముఖాలు క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండాల‌ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని కిసాన్ ర్యాలీలో మాట్లాడుతూ… ప్ర‌భుత్వం పారిశ్రామిక వేత్త‌ల‌కు దాసోహం అవుతూ అన్న‌దాత‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు. దేశంలో శ‌క్తిమంతులు వ్యాపారులు కాద‌ని, రైతులేన‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలుసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ఈ ప్ర‌భుత్వం రైతుల్ని ప‌ట్టించుకోవ‌డం మానేసింద‌ని… ఎప్ప‌డూ విదేశాల్లో తిరుగుతూ ఆకాశంలో నిచ్చెన‌లేస్తూ ప్ర‌ధాని మోడి కాలం గ‌డిపేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. యూపీఏ హ‌యాంలో రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌లు ల‌భించేలా చూశామ‌ని, వ్య‌వ‌సాయ వృద్ధి రేటు 4.2 శాతం ఉంద‌ని, ఎన్డీయే హ‌యాంలో ఈ వృద్ధి రేటు 2.6 మాత్ర‌మేన‌ని అన్నారు. ద‌ేశంలోని అన్ని వ్య‌వ‌స్థ‌లు రైతుల ప‌ట్ల‌, పంట‌ల ప‌ట్ల దృష్టి సారించాల‌ని ఆయ‌న కోరారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ రైతులు ఏమైనా కోరితే వారికి లాఠీలు స‌మాధానం చెబుతున్నాయ‌ని రాహుల్ ఆరోపించారు.
Next Story