Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 61

గొప్పలు తన తండ్రి గురించి కొడుకు ఇలా చెబుతున్నాడు. ‘మా నాన్న పులి, నరసింహ, ఠాగూర్‌’ అన్నాడు. పక్కనే ఉన్న అతడి ఫ్రెండ్‌ ఇలా అన్నాడు. ‘అవునా అయితే మీ నాన్నను చూడాలంటే టిక్కెట్టెంత?’ అన్నాడు. భరణం విడాకులకు కోర్టు అనుమతించింది. జడ్జి భర్తతో ‘మీ ఆవిడకు నెలకు వెయ్యి రూపాయలు భరణంగా ఇవ్వాలని తీర్మానించానయ్యా’ అన్నాడు. దానికి భర్త సంతోషంతో ‘నాక్కూడా ఒక ఐదు వందలిస్తే సంతోషిస్తా’ అన్నాడు. జుత్తు – తెలివి లల్లు : […]

గొప్పలు

తన తండ్రి గురించి కొడుకు ఇలా చెబుతున్నాడు.
‘మా నాన్న పులి, నరసింహ, ఠాగూర్‌’ అన్నాడు. పక్కనే ఉన్న అతడి ఫ్రెండ్‌ ఇలా అన్నాడు. ‘అవునా అయితే మీ నాన్నను చూడాలంటే టిక్కెట్టెంత?’ అన్నాడు.

భరణం

విడాకులకు కోర్టు అనుమతించింది. జడ్జి భర్తతో ‘మీ ఆవిడకు నెలకు వెయ్యి రూపాయలు భరణంగా ఇవ్వాలని తీర్మానించానయ్యా’ అన్నాడు.
దానికి భర్త సంతోషంతో ‘నాక్కూడా ఒక ఐదు వందలిస్తే సంతోషిస్తా’ అన్నాడు.

జుత్తు – తెలివి

లల్లు : మమ్మీ! నాన్న తలమీద ఎందుకు వెంట్రుకలు లేవు?
తల్లి : మీ నాన్న చాలా తెలివైనవాడు. ఎప్పుడూ ఆలోచిస్తాడు.
లల్లు : మరి నీ తలమీద ఎందుకు అంత జుత్తు వుంది?
తల్లి : నోరు మూసుకుని టిఫిన్‌ తిను.

First Published:  19 April 2015 10:00 PM GMT
Next Story