టీఆర్ఎస్ నగర అధ్యక్షుడిగా మైనంపల్లి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా మరోసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయినట్టే. ఈ పదవికి ఆయన తరఫున మంత్రులు ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు వేశారు. ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్టే. అయితే దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి హనుమంతరావు ఎన్నికయ్యారు. ఈయన పేరును డిప్యూటీ సీఎం మహమూద్ ప్రతిపాదించగా తలసాని బలపరిచారు. ఈయన ఎన్నికను మహేంద్రరెడ్డి అధికారికంగా ప్రకటించారు. మంత్రులు నాయిని, […]
BY Pragnadhar Reddy20 April 2015 5:42 AM GMT

X
Pragnadhar Reddy20 April 2015 5:42 AM GMT
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా మరోసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయినట్టే. ఈ పదవికి ఆయన తరఫున మంత్రులు ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు వేశారు. ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్టే. అయితే దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి హనుమంతరావు ఎన్నికయ్యారు. ఈయన పేరును డిప్యూటీ సీఎం మహమూద్ ప్రతిపాదించగా తలసాని బలపరిచారు. ఈయన ఎన్నికను మహేంద్రరెడ్డి అధికారికంగా ప్రకటించారు. మంత్రులు నాయిని, పద్మారావు, తలసాని, మహేందర్‌రెడ్డి మైనంపల్లికి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో నెంబర్ ఒన్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని, పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పని చేసేవారిని సహంచబోమని కొత్తగా ఎన్నికైన మైనంపల్లి అన్నారు.
Next Story