Telugu Global
Others

బోటు బోల్తా.. 700 మంది కూలీల గల్లంతు

రోమ్ : మధ్యధరా సముద్రంలో చేపల వేటకు ఉపయోగించే బోటు నీట మునిగి.. అందులోని దాదాపు 700 మంది వలస కూలీలు గల్లంతయ్యారు. 20 మీటర్ల పొడవున్న ఈ బోటులో లిబియా తీరం నుంచి.. ఇటలీలోని లాంపేడ్యూసాకు బతుకుదెరువు కోసం వందలాది మంది బయలుదేరారు. తీరం నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత.. పోర్చుగీ్‌సకు చెందిన ఓపెద్ద వ్యాపారనౌక వీరి సమీపానికి వచ్చింది. ఆ నౌక ఎక్కడానికి శరణార్థులంతా బోటుకు ఒకే వైపునకు చేరడంతో.. అది బోల్తా […]

రోమ్ : మధ్యధరా సముద్రంలో చేపల వేటకు ఉపయోగించే బోటు నీట మునిగి.. అందులోని దాదాపు 700 మంది వలస కూలీలు గల్లంతయ్యారు. 20 మీటర్ల పొడవున్న ఈ బోటులో లిబియా తీరం నుంచి.. ఇటలీలోని లాంపేడ్యూసాకు బతుకుదెరువు కోసం వందలాది మంది బయలుదేరారు. తీరం నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత.. పోర్చుగీ్‌సకు చెందిన ఓపెద్ద వ్యాపారనౌక వీరి సమీపానికి వచ్చింది. ఆ నౌక ఎక్కడానికి శరణార్థులంతా బోటుకు ఒకే వైపునకు చేరడంతో.. అది బోల్తా పడింది. ఈ ఘటనలో 28 మందిని రక్షించినట్లు యునైటెడ్‌ నేషన్స్‌ హైకమిషనర్‌ ఆఫ్‌ రెఫ్యూజీస్‌ (యూన్‌ఎన్‌హెచ్‌సీఆర్‌) అధికార ప్రతినిధి కర్లొట్టా సమి చెప్పారు. ఇప్పటికి వరకు జరిగిన బోటు ప్రమాదాల్లో ఇదే తీవ్రమైనదని ఐక్యరాజ్య సమితి(ఐరాస) శరణార్థుల సంస్థ వ్యాఖ్యానించింది. దీనిపై మాల్టాదీవుల ప్రధాని జోసెఫ్‌ మస్కట్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనలో 24 మంది మరణించినట్లు వెల్లడించారు. పడవలో 700 కన్నా.. ఎక్కువ మందే ఉన్నట్లు భద్రతా దళాలు రక్షించిన 28 మంది చెబుతుండగా.. 650 మంది ఉండొచ్చని నావికాదళ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
First Published:  20 April 2015 1:11 AM GMT
Next Story