Telugu Global
Others

ప‌ట్టిసీమ‌లో చంద్ర‌బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు

రాజ‌మండ్రి: తెలుగుదేశం ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌ట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్ట‌ర్ల‌కు మేలు చేసే ల‌క్ష్యంతో ప్రారంభించిందేన‌ని వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టును ఏక‌ప‌క్షంగా కాంట్రాక్ట‌ర్ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం వ‌ల్ల చంద్ర‌బాబుకు రూ. 300 కోట్లు ముడుపులుగా ముట్టాయ‌ని ఆయ‌న అన్నారు. రెండో రోజు ప్రాజెక్ట‌ల యాత్ర‌లో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌నులు పూర్త‌వ‌డానికి సంవ‌త్సరం గడువున్నా ముందుగానే బోన‌స్ ప్ర‌క‌ట‌న చేయ‌డం వెనుక కార‌ణం ఇదేన‌ని జ‌గ‌న్ ఆరోపించారు. అస‌లు ప‌ట్టిసీమ చేప‌ట్ట‌డం పోల‌వ‌రం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలో […]

ప‌ట్టిసీమ‌లో చంద్ర‌బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు
X
రాజ‌మండ్రి: తెలుగుదేశం ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌ట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్ట‌ర్ల‌కు మేలు చేసే ల‌క్ష్యంతో ప్రారంభించిందేన‌ని వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టును ఏక‌ప‌క్షంగా కాంట్రాక్ట‌ర్ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం వ‌ల్ల చంద్ర‌బాబుకు రూ. 300 కోట్లు ముడుపులుగా ముట్టాయ‌ని ఆయ‌న అన్నారు. రెండో రోజు ప్రాజెక్ట‌ల యాత్ర‌లో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌నులు పూర్త‌వ‌డానికి సంవ‌త్సరం గడువున్నా ముందుగానే బోన‌స్ ప్ర‌క‌ట‌న చేయ‌డం వెనుక కార‌ణం ఇదేన‌ని జ‌గ‌న్ ఆరోపించారు. అస‌లు ప‌ట్టిసీమ చేప‌ట్ట‌డం పోల‌వ‌రం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలో పెట్ట‌డానికేన‌ని ఆయ‌న ఆరోపించారు. రాయ‌ల‌సీమ‌కు మేలు చేయ‌డానికే ప‌ట్టిసీమ‌ను చేప‌ట్టామ‌న్న చంద్ర‌బాబు, టీడీపీ మంత్రుల వాద‌న‌ల‌ను ఆయ‌న తోసిపుచ్చారు. అస‌లు నిక‌ర జ‌లాలు లేకుండా సీమ‌కు గోదావ‌రి జ‌లాలు ఇస్తాన‌న‌డం ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మేన‌ని జ‌గ‌న్ అన్నారు.-పీఆర్‌
Next Story