Telugu Global
Others

తెలివైన భార్యలకోసమే జ్యోతిక సినిమా

సెకండ్ ఇన్నింగ్స్ క‌బుర్ల‌లో జ్యోతిక  ఒకప్పుడు తెలుగు, త‌మిళ సినిమాల్లో విజ‌య‌వంతమైన హీరోయిన్‌గా గుర్తింపు పొందిన జ్యోతిక తిరిగి న‌టించ‌డం మొద‌లుపెట్టారు… అదీ త‌మ సొంత నిర్మాణ సంస్థ తీస్తున్న 36 వ‌యాధినిలే సినిమాతో. త‌మిళ హీరో సూర్య‌ని వివాహం చేసుకున్న త‌రువాత ఆమె సినిమాల‌కు గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్ల‌లు. పాప దియాకు ఏడు, బాబు దేవ్ కు ఐదేళ్లు వ‌చ్చాక జ్యోతిక‌ తిరిగి త‌న కెరీర్‌ని కొన‌సాగించే ప‌నిలో ఉన్నారు. […]

తెలివైన భార్యలకోసమే జ్యోతిక సినిమా
X

సెకండ్ ఇన్నింగ్స్ క‌బుర్ల‌లో జ్యోతిక

ఒకప్పుడు తెలుగు, త‌మిళ సినిమాల్లో విజ‌య‌వంతమైన హీరోయిన్‌గా గుర్తింపు పొందిన జ్యోతిక తిరిగి న‌టించ‌డం మొద‌లుపెట్టారు… అదీ త‌మ సొంత నిర్మాణ సంస్థ తీస్తున్న 36 వ‌యాధినిలే సినిమాతో. త‌మిళ హీరో సూర్య‌ని వివాహం చేసుకున్న త‌రువాత ఆమె సినిమాల‌కు గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్ల‌లు. పాప దియాకు ఏడు, బాబు దేవ్ కు ఐదేళ్లు వ‌చ్చాక జ్యోతిక‌ తిరిగి త‌న కెరీర్‌ని కొన‌సాగించే ప‌నిలో ఉన్నారు. చిత్రంగా ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమా సైతం అలాంటి క‌థ‌తోనే రూపొందుతోంది. ఆడ‌వాళ్లలో చాలామంది త‌మ భ‌ర్త‌ల‌కంటే తెలివైన వాళ్లే అయినా పెళ్లి త‌రువాత త‌మ జీవితాల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌టం మానేస్తారు. కుటుంబానికే పూర్తి జీవితాన్ని అంకితం చేసేందుకు సిద్ధ‌ప‌డ‌తారు. అలాకాకుండా మ‌హిళ‌లు త‌మ గురించి కూడా తాము ప‌ట్టించుకోవాల‌ని, త‌న సినిమా ఆ విష‌యాన్నే చెబుతుంద‌ని జ్యోతిక అంటున్నారు. ప్ర‌స్తుతం త‌న‌ పిల్ల‌ల క్లాస్‌మేట్స్ త‌ల్లుల్లో యాభైనుండి అర‌వై మంది వ‌ర‌కు త‌న‌కు స్నేహితులు ఉన్నార‌ని, వారంతా ఎంతో తెలివైన వార‌ని జ్యోతిక అంటున్నారు. తాను కూడా కెరీర్‌కి బ్రేక్ మాత్ర‌మే ఇచ్చి పెళ్లి చేసుకున్న‌ట్టుగా చెప్పుకొచ్చారు. త‌న‌కు జీవితంలో అన్నీ ఇచ్చిన త‌మిళ సినిమాకు కృత‌జ్ఞ‌త‌గా, అక్క‌డి మ‌హిళ‌ల‌కు ఒక మ‌హిళ‌గా అందిస్తున్న కానుక‌గా జ్యోతిక ఈ సినిమాను అభివ‌ర్ణిస్తున్నారు.మ‌ల‌యాళం సినిమా హౌ ఓల్డ్ ఆర్ యుకి రీమేక్‌గా 36… సినిమాని రూపొందిస్తున్నారు. సినిమాలో ఉన్న సందేశం త‌న‌కు ఎంత‌గానో న‌చ్చింద‌ని జ్యోతిక చెప్పారు. ముఖ్యంగా ఈ మ‌ధ్య చాలా త‌మిళ సినిమాల్లో అన‌వ‌స‌రంగా ప్రేక్ష‌కుల‌ను షాక్‌కి గురిచేయ‌డానికి ముఖ్య‌మైన‌ పాత్ర‌ల‌ను చంపేస్తున్నార‌ని, ఇందులో అలాంటివి లేవ‌ని ఆమె అన్నారు. తిరిగి సినిమాల్లో న‌టించేందుకు తాను చేసిన ప్ర‌య‌త్నాల‌ను వివ‌రిస్తూ బాబు పుట్టాక తాను బాగా బ‌రువుపెరిగాన‌ని, కొన్నేళ్లుగా యోగా, వ్యాయామాలు చేస్తున్నాన‌ని అన్నారు. కెరీర్ మంచి ద‌శ‌లో ఉండ‌గానే సినిమాలు వ‌దులుకుని వివాహం చేసుకోవడం ప‌ట్ల ఎలాంటి అసంతృప్తీ లేద‌న్నారు జ్యోతిక‌. భ‌ర్త పిల్ల‌లు కుటుంబం అనే చ‌క్క‌ని క‌ల‌ని నిజం చేసుకున్నాన‌ని ఆనందంగా చెప్పారు. అయినా కెరీర్ ప‌ట్ల తానింకా మునుప‌టిలాగే అంత‌టి అంకిత‌భావంతోనే ఉన్నానంటూ త‌న మ‌న‌సులోని భావాల‌ను వ్య‌క్తం చేశారు. తిరిగి సినిమాల్లోకి రావాల‌నే ఆలోచ‌న‌తోనే పెళ్లి త‌రువాత పిల్ల‌ల‌ను క‌నేందుకు గ్యాప్ తీసుకోలేద‌ని ఆమె తెలిపారు.

Next Story