Telugu Global
Others

మద్యంతో మత్తెక్కించారు.. ఖజానాను నింపారు

           కృష్ణాజిల్లాలో మద్యాన్ని దారాళంగా తాగించేశారు. మద్యం బాబుల తలలో నిషా ఎక్కించి మరీ కాసులు దండుకున్నారు. అంతేకాదు ఎక్సైజ్ శాఖ ఖజానాలో ఖజానా భారీగా వచ్చిపడగా, రికార్డు నెలకొల్పారు. ఏ స్థాయిలో మద్నాన్ని ఏరులైపారిస్తున్నారో అర్థంచేసుకోవచ్చు.           కృష్ణాజిల్లాలో మందు ప్రియులు ఈ ఏడాది తెగతాగేశారు. ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.1127 కోట్ల అమ్మకాలతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం […]

మద్యంతో మత్తెక్కించారు.. ఖజానాను నింపారు
X

కృష్ణాజిల్లాలో మద్యాన్ని దారాళంగా తాగించేశారు. మద్యం బాబుల తలలో నిషా ఎక్కించి మరీ కాసులు దండుకున్నారు. అంతేకాదు ఎక్సైజ్ శాఖ ఖజానాలో ఖజానా భారీగా వచ్చిపడగా, రికార్డు నెలకొల్పారు. ఏ స్థాయిలో మద్నాన్ని ఏరులైపారిస్తున్నారో అర్థంచేసుకోవచ్చు.

కృష్ణాజిల్లాలో మందు ప్రియులు ఈ ఏడాది తెగతాగేశారు. ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.1127 కోట్ల అమ్మకాలతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆదాయం గత ఏడాదికంటే దాదాపు రూ.59 కోట్లు అధికం.

మద్యం విక్రయాలతో ఆదాయం రెట్టింపు చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.127 కోట్ల అమ్మకాలతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం రికార్డుస్థాయిలో ఆదాయాన్ని రాబట్టింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు దాదాపుగా అదేస్థాయిలో ఉన్నప్పటికీ ధరలు గణనీయంగా పెరగడంతో సుమారు రూ.59 కోట్లు అధికంగా వచ్చింది. ఈ ఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 28 లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. కేసుల సంఖ్య కొంచెం అటుఇటుగా నమోదయ్యాయి.

2014, 15 ఆర్థిక సంవత్సరంలో పలు ఎన్నికలు రావడంతో మద్యం ఏరులై పారింది. గ్రామీణ ప్రాంతాల్లో చోటామోటా నాయకులందరూ మద్యం పంపిణీ చేయడంతో వ్యాపారం జోరుగా సాగింది. స్థానిక, సార్వత్రిక, ఎమ్మెల్సీ, సహకార సంస్థల ఎన్నికలు ఒకదాని వెంట మరొకటి రావడంతో మందు బాబులు పండుగ చేసుకున్నారు. అనుమతులు లేని దుకాణాలు, బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించడం, ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరలకు అమ్మకాలు నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించి జరిమానాలు వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికే రూ.కోట్ల ఆదాయం వచ్చింది.

బార్లు, వైన్ షాపుల యజమానులు ఎమ్మార్పీ కన్నా దాదాపు రూ.30 నుంచి రూ.40 పెంచి అమ్ముతుండడంతో మందు బాబులు బెంబేలెత్తుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇన్ కమ్ ట్యాక్స్ కట్టలేదని ఏపీబీసీఎల్ డిపోలను అధికారులు మూసివేయడంతో బార్లు, వైన్ షాపుల యజమానులు సరుకు లేక దుకాణాలను మూసుకోవాల్సిన పరిస్థితి. ముందే జాగ్రత్తపడి సరుకును పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్న దుకాణదారులు విచ్చలవిడిగా ధరలు పెంచి అమ్మకాలు సాగించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో సివిల్ సప్లైస్ గోడౌన్లలో సరుకు దింపి పంపిణీ చేస్తుండడంతో ఇప్పుడు కొరత పరిస్థితి లేదు. దీంతో మళ్లీ ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు విక్రయించే దుకాణాలపై దృష్టి పెడుతున్నామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

Next Story