Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 48

హోంవర్క్‌ టీచర్‌ : మ్యాథ్స్‌ హోంవర్కులో ఒక్క మనిషి ఇన్ని తప్పులు చేయగలడని నేనెప్పుడూ అనుకోలేదు. స్టూడెంట్‌ : నేనొక్కడే కాదు టీచర్‌, దీంట్లో మా నాన్న చెయ్యి కూడా వుంది. ************ గురిచూసి కొట్టు ‘అరే! ఏంటయ్యా! మీవాడు నాపైన రాయి విసిరాడు’ ‘అలాగా! మీకు తగిలిందా?’ ‘లేదు. కొద్దిలో తప్పిపోయింది’ ‘ఐతే వాడు మా వాడు కాడు’ *********** ఫోన్‌ నందు : అరే! నీ చెవులు ఎలా కాలాయి? ఎందుకు కాలాయి? ఆనంద్‌ […]

హోంవర్క్‌

టీచర్‌ : మ్యాథ్స్‌ హోంవర్కులో ఒక్క మనిషి ఇన్ని తప్పులు చేయగలడని నేనెప్పుడూ అనుకోలేదు.
స్టూడెంట్‌ : నేనొక్కడే కాదు టీచర్‌, దీంట్లో మా నాన్న చెయ్యి కూడా వుంది.

************

గురిచూసి కొట్టు

‘అరే! ఏంటయ్యా! మీవాడు నాపైన రాయి విసిరాడు’
‘అలాగా! మీకు తగిలిందా?’
‘లేదు. కొద్దిలో తప్పిపోయింది’
‘ఐతే వాడు మా వాడు కాడు’

***********

ఫోన్‌

నందు : అరే! నీ చెవులు ఎలా కాలాయి? ఎందుకు కాలాయి?
ఆనంద్‌ : నేను ఐరన్‌ చేస్తూ ఉంటే టెలిఫోన్‌ రింగయింది. నేను ఐరన్‌ బాక్స్‌ ఫోననుకుని మాట్లాడాను.
నందు : మరి రెండో చెవి ఎందుకు కాలింది.
ఆనంద్‌ : నేను ఐరన్‌ బాక్స్‌ కింద పెట్టగానే మళ్లీ టెలిఫోన్‌ మోగింది.

************

సస్పెన్స్‌

సురేష్‌ తన క్లాసుమేట్‌ రమేష్‌తో ‘ఒక బుద్ధిహీనుణ్ణి సస్పెన్స్‌లో పెట్టడం ఎలాగో తెలుసా?’ అని అడిగాడు.
రమేష్‌ ఉత్సాహంగా, ‘తెలీదు. ఎలా?’ అన్నాడు.
‘సరేలే, ఇంకో రోజు చెబుతాలే’ అన్నాడు సురేష్‌.

First Published:  13 April 2015 7:00 PM GMT
Next Story