పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్..
గబ్బర్ సింగ్ చిత్రం సక్సెస్ ప్రభావం పవన్ ప్రేక్షకులను ఇంకా ఒక ట్రాన్స్ లోనే వుంచింది అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఆయన అభిమానులు లక్ష కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కొంత కాలం పొలిటికల్ గా బిజీ కావడంతో.. గబ్బర్ సింగ్ సీక్వెల్ చిత్రం పని అటకెక్కింది. ఎలక్షన్స్ అయిన తరువాత సినిమా చేద్దామని ప్రయత్నిస్తే..డైరెక్టర్ సంపత్ నంది సిద్దం చేసిన సీక్వెల్ కథ నచ్చక పోవడంతో మళ్లీ కొంత […]
BY Pragnadhar Reddy13 April 2015 7:35 AM GMT
X
Pragnadhar Reddy Updated On: 13 April 2015 7:36 AM GMT
గబ్బర్ సింగ్ చిత్రం సక్సెస్ ప్రభావం పవన్ ప్రేక్షకులను ఇంకా ఒక ట్రాన్స్ లోనే వుంచింది అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఆయన అభిమానులు లక్ష కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కొంత కాలం పొలిటికల్ గా బిజీ కావడంతో.. గబ్బర్ సింగ్ సీక్వెల్ చిత్రం పని అటకెక్కింది. ఎలక్షన్స్ అయిన తరువాత సినిమా చేద్దామని ప్రయత్నిస్తే..డైరెక్టర్ సంపత్ నంది సిద్దం చేసిన సీక్వెల్ కథ నచ్చక పోవడంతో మళ్లీ కొంత కాలం ఆలస్యం అయ్యింది. కట్ చేస్తే ఎట్టకేలకు పవర్ స్టార్ గబ్బ ర్ సింగ్ 2 కు గట్టిగానే నడుం బిగించినట్లు తెలుస్తుంది. నాకు కొంచెం తిక్కుంది . దానికో లెక్కుంది… అంటూ పవర్ స్టార్ చేసిన హంగామా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మొత్తం మీద పవర్ స్టారే గబ్బర్ సింగ్ 2 కు కథను సిద్దం చేశాడు. అయితే దర్శకత్వం డైరెక్టర్ బాబీకి అప్పచెప్పాడు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా అనీషా అంబ్రోస్ ను ఎంపిక చేశారు. కథ రీత్యా మరో హీరోయిన్ ను ఎంపిక చేయడానికి అవకాశం ఉంది. ఈ చిత్రం వచ్చే వారంలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుందని టాక్.
Next Story