Telugu Global
Others

మోదీ జీవిత క‌థ తో సినిమా..

బాలీవుడ్ ఆర్టిస్ట్ ప‌రేష్ రావెల్ తెలుగు అభిమానుల‌కు సుప‌రిచితుడే. కెరీర్ ప్రారంభంలో “క్ష‌ణ క్ష‌ణం” , “మ‌నీ మ‌నీ” చిత్రాల‌తో మెప్పించాడు. ఈ మ‌ధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన శంక‌ర్ దాదా చిత్రంలో ప్రొఫెసర్ గా చేసి మెప్పించాడు. ఈచిత్రంలో లింగం మామ అంటూ చిరు తెగ ఆట పట్టిస్తాడు. ఇయ‌న గారికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడి అంటే వ్య‌క్తిగతంగా కూడా చాలా ఇష్టం. ఈ యేడాది ఆగ‌స్టు లో మోదీ జీవిత చ‌రిత్రతో సినిమాను […]

మోదీ జీవిత క‌థ తో సినిమా..
X

బాలీవుడ్ ఆర్టిస్ట్ ప‌రేష్ రావెల్ తెలుగు అభిమానుల‌కు సుప‌రిచితుడే. కెరీర్ ప్రారంభంలో “క్ష‌ణ క్ష‌ణం” , “మ‌నీ మ‌నీ” చిత్రాల‌తో మెప్పించాడు. ఈ మ‌ధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన శంక‌ర్ దాదా చిత్రంలో ప్రొఫెసర్ గా చేసి మెప్పించాడు. ఈచిత్రంలో లింగం మామ అంటూ చిరు తెగ ఆట పట్టిస్తాడు. ఇయ‌న గారికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడి అంటే వ్య‌క్తిగతంగా కూడా చాలా ఇష్టం. ఈ యేడాది ఆగ‌స్టు లో మోదీ జీవిత చ‌రిత్రతో సినిమాను ప్రారంభిస్తారు. ఓ సినిమా ప్ర‌చార కార్య క్ర‌మంలో పాల్గొన్న ప‌రేష్ రావెల్ మోదీ జీవిత చ‌రిత్రతో సినిమా చేస్తున్న‌ట్టు చెప్పారు. లీడ్ రోల్ ప‌రేష్ రావెల్ పోషిస్తున్నారు. గ‌తంలో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ గా ప‌రేష్ రావెల్ మెప్పించారు. ప్ర‌స్తుతం బిజేపి సిట్టింగ్ ఎంపీగా వున్న ప‌రేష్ పార్ల‌మెంట్ లో చ‌ర్చ‌లు త‌న‌కు ఎంతో ఉప‌క‌రిస్తున్నాయ‌ని తెలిపారు. మొత్తం మీద ప‌రేష్ రావెల్ న‌రేంద్ర మోదీ జీవితాన్ని సినిమాగా చేయ‌డానికి డెడికేటెడ్ గా వర్కువుట్ చేస్తున్నార‌న్న‌మాట‌.

First Published:  8 April 2015 7:30 AM GMT
Next Story