ఒకర్ని కాపాడబోయి ఏడుగురు మృతి
ఒక యువతిని కాపాడబోయి కుటుంబంతోపాటు కొంతమంది బంధువులు కూడా దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణమైన సంఘటన చైనాలో చోటుచేసుకొంది. చైనాలోని ఓ కుటుంబం తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లింది. అవి పూర్తయిన తరువాత శ్మశానం పక్కన ఉన్న రిజర్వాయర్లో స్నానం చేయడానికి వెళ్లారు. అయితే వారిలో 17 ఏళ్ల యువతి పొరపాటున అక్కడ ఉన్న రిజర్వాయర్లో పడిపోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన ఆమె కుటుంబం సభ్యులతోపాటు బంధువులు మొత్తం ఏడుగురు మరణించారు. అయితే వారిలో ఎవరికి పెద్దగా […]
BY Pragnadhar Reddy6 April 2015 9:39 PM GMT
Pragnadhar Reddy Updated On: 6 April 2015 9:39 PM GMT
ఒక యువతిని కాపాడబోయి కుటుంబంతోపాటు కొంతమంది బంధువులు కూడా దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణమైన సంఘటన చైనాలో చోటుచేసుకొంది. చైనాలోని ఓ కుటుంబం తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లింది. అవి పూర్తయిన తరువాత శ్మశానం పక్కన ఉన్న రిజర్వాయర్లో స్నానం చేయడానికి వెళ్లారు. అయితే వారిలో 17 ఏళ్ల యువతి పొరపాటున అక్కడ ఉన్న రిజర్వాయర్లో పడిపోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన ఆమె కుటుంబం సభ్యులతోపాటు బంధువులు మొత్తం ఏడుగురు మరణించారు. అయితే వారిలో ఎవరికి పెద్దగా ఈత రాదని, అయినా యువతిని కాపాడటానికి ప్రయత్నించారని చైనా పోలీసులు తెలిపారు.-పీఆర్
Next Story