హెపటైటిస్‌పై ప్రచార కార్యక్రమాల్లో అమితాబ్!
జనానికి ఏదో రకంగా మేలు చేయాలని సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఆలోచిస్తున్నారు. తనకున్న స్టార్ ఇమేజ్‌ను ఉపయోగించుకోవలసిందిగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆఫర్ ఇస్తున్నారు. విద్య, వైద్యం వంటి ప్రజాహిత పథకాల్లో తన భాగస్వామ్యం అవసరమైతే అందించడానికి తాను సిద్ధమేనని అంటున్నారు అమితాబ్. ప్రస్తుతం.. హెపటైటిస్-బి సహా పలు ఆరోగ్య అంశాలపై ప్రచారం కల్పించేందుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చారు. వ్యాధుల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి ఆయన మద్దతు తెలిపారు. భార్య […]
BY Pragnadhar Reddy7 April 2015 1:02 AM GMT

X
Pragnadhar Reddy7 April 2015 1:02 AM GMT
జనానికి ఏదో రకంగా మేలు చేయాలని సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఆలోచిస్తున్నారు. తనకున్న స్టార్ ఇమేజ్‌ను ఉపయోగించుకోవలసిందిగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆఫర్ ఇస్తున్నారు. విద్య, వైద్యం వంటి ప్రజాహిత పథకాల్లో తన భాగస్వామ్యం అవసరమైతే అందించడానికి తాను సిద్ధమేనని అంటున్నారు అమితాబ్. ప్రస్తుతం.. హెపటైటిస్-బి సహా పలు ఆరోగ్య అంశాలపై ప్రచారం కల్పించేందుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చారు. వ్యాధుల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి ఆయన మద్దతు తెలిపారు. భార్య జయాబచ్చన్‌తో కలిసి ఆయన సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఆరోగ్య సమస్యలపై ప్రజలను చైతన్యం చేసేందుకు తన వంతు సాయం అందిస్తామని బిగ్ బీ జంట ఈ సందర్భంగా మంత్రికి హామీ ఇచ్చింది. పోలియో, టీబీపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాల్లో బిగ్ బీ గతంలో కూడా పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చినపుడు కూడా ప్రజాహిత కార్యక్రమాల్లో తన అవసరం ఉంటే తప్పకుండా సహకరిస్తానని హామీ ఇచ్చారు.-పీఆర్
Next Story