Telugu Global
NEWS

త‌గునా నీకిది కేటీఆర్‌!

ఉగ్రదాడి జరిగింది. ముగ్గురు పోలీసులు చనిపోయారు. మరో ఎస్‌ఐ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. యావత్‌ తెలంగాణ ప్రజలు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. పోలీసులూ అందుకు భిన్నమేమీ కాదు. ఓ వైపు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన కానిస్టేబుల్‌ నాగరాజు అంత్యక్రియలు జరిగాయి. అదే సమయంలో హైదరాబాద్‌ నడిబొడ్డున… అదీ ట్రాఫిక్‌ మొత్తాన్నీ ఆపేసి మరీ ట్యాంక్‌బండ్‌ఫై కారు రేసులు, బైక్‌ విన్యాసాలు జరిగాయి. అందులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఫార్ములా వన్‌ కారు ఎక్కి తన […]

త‌గునా నీకిది కేటీఆర్‌!
X
ఉగ్రదాడి జరిగింది. ముగ్గురు పోలీసులు చనిపోయారు. మరో ఎస్‌ఐ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. యావత్‌ తెలంగాణ ప్రజలు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. పోలీసులూ అందుకు భిన్నమేమీ కాదు. ఓ వైపు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన కానిస్టేబుల్‌ నాగరాజు అంత్యక్రియలు జరిగాయి. అదే సమయంలో హైదరాబాద్‌ నడిబొడ్డున… అదీ ట్రాఫిక్‌ మొత్తాన్నీ ఆపేసి మరీ ట్యాంక్‌బండ్‌ఫై కారు రేసులు, బైక్‌ విన్యాసాలు జరిగాయి. అందులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఫార్ములా వన్‌ కారు ఎక్కి తన సరదా తీర్చుకున్నారు. బంగారు తెలంగాణ తెస్తాం, తెలంగాణలో పోలీసింగ్‌ వ్యవస్థనే మార్చేస్తాం అంటూ కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉంటారు. అనడమే కాదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కూడా. ఇన్నోవా వాహనాలు, బైక్‌లు పోలీసులకు అందించారు. అంతేనా? దాంతోనే ప్రభుత్వం పని అయిపోతుందా? తెలంగాణ పోలీసులకే చెమటలు పట్టించిన ఉగ్రవాదులను చంపి సంతోషపడాలో… వీరమరణం పొందిన తమ సిబ్బంది భౌతికకాయాలను చూసి ఆవేదన చెందాలో తెలియని సమయంలో బాధ్యతల గల మంత్రి పదవిలో ఉండీ… అదీ ముఖ్యమంత్రి కుమారుడైన కేటీఆర్‌ కారు రేసింగ్‌లో పాల్గొనడంపై కచ్చితంగా విమర్శలు వస్తాయి. ఇదే హైదరాబాద్‌లో ఎస్‌ఐ సిద్ధయ్య ఆస్పత్రిలో ఉన్నాడు. కనీసం ఆయన్ను చూసిన పాపనపోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు కదా ఆయన కుటుంబంలోని మరో మంత్రి కేటీఆర్‌ కూడా ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడలేదు. చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తేనో, బాగా పోరాడారని ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తేనో పోలీసుల్లో ధైర్యం వస్తుందా? నేనున్నానంటూ దగ్గరకు వెళ్లి భుజం తట్టి ఓదారిస్తే ధైర్యం వస్తుందా? ఆలోచించాలి. యావత్‌ తెలుగు ప్రజలు పోలీసులకు బాసటగా నిలవాలి. కులం, మతం, రంగుతో సంబంధం లేని ఉగ్రవాదాన్ని అణిచేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నం చేయాలి.-ఎస్‌
First Published:  6 April 2015 1:27 AM GMT
Next Story