అమెజాన్ బటన్ నొక్కండి.. సరుకులు పొందండి!
మీ ఇంట్లో వెచ్చాలు అయిపోయాయా? ఇంట్లో తెచ్చివ్వడానికి ఎవరూ లేరా?… పోనీ మీరే వెంటనే పరుగుపరుగున దుకాణానికి వెళుతున్నారా? అయితే కాస్త ఆగండి! ఒక్క బటన్ నొక్కితే చాలు… ఇంటి దాకా మేమే తెచ్చిస్తాం అంటోంది ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్! వైఫై కనెక్షన్ ద్వారా అమెజాన్ యాప్‌నకు దీనిని అనుసంధానిస్తారు. ఆన్లైన్లో అస్తమాను షాపింగ్ చేయలేని వారు, గృహిణులు దీనిని సులభంగా వినియోగించుకోవచ్చని అంటోంది సంస్థ! ప్రస్తుతానికి టైడ్, హగ్గీస్, జిల్లెట్ వంటి సంస్థలతో మాత్రమే […]
BY Pragnadhar Reddy6 April 2015 12:17 AM GMT
Pragnadhar Reddy Updated On: 6 April 2015 12:17 AM GMT
మీ ఇంట్లో వెచ్చాలు అయిపోయాయా? ఇంట్లో తెచ్చివ్వడానికి ఎవరూ లేరా?… పోనీ మీరే వెంటనే పరుగుపరుగున దుకాణానికి వెళుతున్నారా? అయితే కాస్త ఆగండి! ఒక్క బటన్ నొక్కితే చాలు… ఇంటి దాకా మేమే తెచ్చిస్తాం అంటోంది ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్! వైఫై కనెక్షన్ ద్వారా అమెజాన్ యాప్‌నకు దీనిని అనుసంధానిస్తారు. ఆన్లైన్లో అస్తమాను షాపింగ్ చేయలేని వారు, గృహిణులు దీనిని సులభంగా వినియోగించుకోవచ్చని అంటోంది సంస్థ! ప్రస్తుతానికి టైడ్, హగ్గీస్, జిల్లెట్ వంటి సంస్థలతో మాత్రమే ఒప్పందం కుదుర్చుకుని మూడు ఉత్పత్తులకు మాత్రమే పరిమితమైంది.-పీఆర్
Next Story