Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 33

‘పద్మదూషణ్‌’ ఎప్పుడూ ఎవరినో ఒకరిని తీవ్రంగా విమర్శించడం అలవాటున్న ఒక మిత్రుడికి ‘పద్మదూషణ్‌” అని బిరుదిచ్చారు! వరద రాజేశ్వరరరావుగారు. ************ ‘ఆవిష్కర్మ’ ఈ మధ్య ప్రతి రచయితా తన పుస్తకానికి ఆవిష్కరణమహోత్సవం సభాముఖంగా జరిపించుకోవడం ఆనవాయితీ అయింది. ఎవరిదో పుస్తకాన్ని ఆవిష్కరించమని ఆయన్ని కోరినప్పుడు, ”ఇది ఆవిష్కరణకాదు – ‘ఆవిష్కర్మ’ అని చమత్కరించారు. ************ గూర్ఖా, మూర్ఖా ఆయన చీటికి మాటికీ తన స్నేహితులతో కలిసి బయట తిరగడానికి వెడుతూ నన్ను ”తలుపేసుకో” అనే వారు వెళ్లేటప్పుడు. […]

‘పద్మదూషణ్‌’
ఎప్పుడూ ఎవరినో ఒకరిని తీవ్రంగా విమర్శించడం అలవాటున్న ఒక మిత్రుడికి ‘పద్మదూషణ్‌” అని బిరుదిచ్చారు! వరద రాజేశ్వరరరావుగారు.
************
‘ఆవిష్కర్మ’
ఈ మధ్య ప్రతి రచయితా తన పుస్తకానికి ఆవిష్కరణమహోత్సవం సభాముఖంగా జరిపించుకోవడం ఆనవాయితీ అయింది. ఎవరిదో పుస్తకాన్ని ఆవిష్కరించమని ఆయన్ని కోరినప్పుడు, ”ఇది ఆవిష్కరణకాదు – ‘ఆవిష్కర్మ’ అని చమత్కరించారు.
************
గూర్ఖా, మూర్ఖా
ఆయన చీటికి మాటికీ తన స్నేహితులతో కలిసి బయట తిరగడానికి వెడుతూ నన్ను ”తలుపేసుకో” అనే వారు వెళ్లేటప్పుడు. ఓ రోజున నాకు ఒళ్ళుమండి, ”నేను ఇంట్లో ‘గూర్ఖా’లా ఉండి ఉండాలా?” అన్నాను. ఆయన నవ్వి, ”నేను ‘మూర్ఖా’లా బయటికి పోవడం లేదా?” అన్నారు.
************
”అగ్లీగా….”
నేను చేసిన ఒక బొమ్మని ఆయనకి చూపించి ”ఏమండీ, మరీ ‘అగ్లీ’గా ఉందా?” అని అడిగాను లేదులే, ఫరవాలేదు అంటారని ఆశిస్తూ. ”అగ్లీగా ఉన్నవాళ్లు మాత్రం లోకంలో లేరుటే!” అన్నారు తాపీగా.

First Published:  6 April 2015 8:00 AM GMT
Next Story