Telugu Global
Others

మచిలీపట్నం రూరల్‌ పోలీసుస్టేషనుపై గ్రామస్థుల దాడి

ఓ చోరీ కేసులో ముగ్గురు విద్యార్థులు, ఆటోడ్రైవరుపై అక్రమంగా కేసులు పెట్టి చితకబాదిన పోలీసులపై గ్రామస్థులు తిర‌గ‌బ‌డ్డారు. ఈ సంఘ‌టన‌కు కార‌ణ‌మైన ఖాకీల‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లపల్లి మండలం మంగళాపురానికి చెందిన నలుగురిపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టార‌ని గ్రామ‌స్తులు ఆరోపించారు. వీరిని స్టేష‌న్‌కు తీసుకెళ్ళి చితకబాదారని ఆరోపిస్తూ గ్రామస్థులు మచిలీపట్నం రూరల్‌ పోలీసుస్టేషనులోని కానిస్టేబుల్‌పై దాడి చేశారు. పోలీసుస్టేషనులో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి గ్రామస్థులు త‌మ ఆందోళన తెలియ‌జేశారు.-పీఆర్‌

Next Story