Telugu Global
NEWS

ఎంట్రీ టాక్స్‌..... పాపం... గ‌వ‌ర్న‌ర్ పుణ్య‌మేట‌!

ఎంట్రీ. టాక్స్ వివాదం చినికిచినికి గ‌వ‌ర్న‌ర్‌పై ప‌డింది… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదమిది. ప్రస్తుతం హైద్రాబాద్‌ తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి కూడా రాజధాని ఇదే. ఇక్కడే వస్తోంది అస‌లు స‌మ‌స్య‌. హైద్రాబాద్‌కి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రయాణాలు తప్పనిసరి. రోడ్డు మార్గాన హైద్రాబాద్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎవరొచ్చినా, ఈ ఎంట్రీ టాక్స్‌ దెబ్బ తినాల్సిందే. ఏప్రిల్‌ 1 నుంచి ఎంట్రీ టాక్స్‌ని అమ‌లు చేసింది తెలంగాణ సర్కార్‌.. అసలు ఈ వివాదానికి […]

ఎంట్రీ టాక్స్‌..... పాపం... గ‌వ‌ర్న‌ర్ పుణ్య‌మేట‌!
X
ఎంట్రీ. టాక్స్ వివాదం చినికిచినికి గ‌వ‌ర్న‌ర్‌పై ప‌డింది… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదమిది. ప్రస్తుతం హైద్రాబాద్‌ తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి కూడా రాజధాని ఇదే. ఇక్కడే వస్తోంది అస‌లు స‌మ‌స్య‌. హైద్రాబాద్‌కి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రయాణాలు తప్పనిసరి. రోడ్డు మార్గాన హైద్రాబాద్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎవరొచ్చినా, ఈ ఎంట్రీ టాక్స్‌ దెబ్బ తినాల్సిందే. ఏప్రిల్‌ 1 నుంచి ఎంట్రీ టాక్స్‌ని అమ‌లు చేసింది తెలంగాణ సర్కార్‌.. అసలు ఈ వివాదానికి కారణం గవర్నర్‌ నరసింహన్‌ అన్నది తాజాగా మీడియాలో విన్పిస్తోన్న కథనాల సారాంశం. రాష్ట్రపతి పాలనలో ఉన్న సమయంలో పరిపాలనా పగ్గాలు గవర్నర్‌ చేతిలో ఉండడంతో ఆయన అడ్డగోలుగా తెచ్చిన జీవో కారణంగానే ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యా ‘ఎంట్రీ టాక్స్‌’ వివాదం నెలకొందన్నదన్న‌ది అంద‌రి మాట‌.
అసలేం జరిగింది.? అన్నదానిపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇస్తుందో, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చెబుతుందో.. గవర్నర్‌ కార్యాలయం చెబుతుందో చూడాలి. విభజన చట్టంలోని 72 (1), 72 (1) సెక్షన్ల ప్రకారం.. ఇరు రాష్ట్రాల్లో అపాయింటెడ్‌ డేకి ముందు ఎక్కడ రవాణా పర్మిట్లు తీసుకున్నా, ఎంత కాలానికి పర్మిట్లు తీసుకున్నారో ఆ కాలం ముగిసేదాకా విడిగా ఏ రాష్ట్రానికీ పన్నులుగానీ, ఎంట్రీ టాక్స్‌లుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, అపాయింటెడ్‌ డేకి ఒక్క రోజు ముందు ఓ జీవో వచ్చింది. అదే, మార్చ్‌ 31 తర్వాత ఇరు రాష్ట్రాలూ సమీక్షించుకుని ఎంట్రీ టాక్స్‌, పన్నుల విషయంలో తమకు తోచిన నిర్ణయాలు తీసుకోవచ్చన్నది ఆ జీవో సారాంశం. సరిగ్గా దీన్నే తెలంగాణ సద్వినియోగం చేసుకుంది. మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ వివాదంపై ఆచి తూచి స్పందిస్తోంది. గవర్నర్‌కి ఫిర్యాదు చేసింది. అంతలోనే విభజన చట్టంలోని సెక్షన్లు, గవర్నర్‌ పాలనలో వచ్చిన జీవో అంశం తెరపైకొచ్చాయి. మరిప్పుడు గవర్నర్‌ ఈ అంశంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదెక్క‌డి న్యాయం అంటూ ఏపీ నాయ‌కులు గ‌వ‌ర్న‌ర్‌పై వేలెత్తి చూపుతున్నారు.-పీఆర్‌
First Published:  4 April 2015 2:07 AM GMT
Next Story