Telugu Global
NEWS

ఆర్టీపీపీలో రికార్డు స్థాయి ఉత్పత్తి సమష్టి కృషితోనే సాధ్యం: చీఫ్‌ ఇంజినీరు

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ (ఆర్టీపీపీ) అధికోత్పత్తిని సాధించి రికార్డును సృష్టించింద‌ని చీఫ్‌ ఇంజినీరు కుమార్‌బాబు తెలిపారు. మూడు యూనిట్లు నిరంతరాయంగా ఉత్పత్తిని సాధించి గత రికార్డును తిరగరాసినట్లు తెలిపారు. ఆర్టీపీపీలోని 210 మెగావాట్ల సామర్థ్యం గలిగిన మూడో యూనిట్‌ గతంలో 136 రోజులు నిరంతరాయంగా ఉత్పత్తిని అందించి రికార్డు సృష్టించింది. అయితే ప్రస్తుతం 197 రోజులుగా ఎక్క‌డా ఆగ‌కుండా ఉత్పత్తిని అందిస్తోందన్నారు. 4వ యూనిట్‌ గతంలో వంద రోజులుపాటు నాలుగుసార్లు రికార్డును […]

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ (ఆర్టీపీపీ) అధికోత్పత్తిని సాధించి రికార్డును సృష్టించింద‌ని చీఫ్‌ ఇంజినీరు కుమార్‌బాబు తెలిపారు. మూడు యూనిట్లు నిరంతరాయంగా ఉత్పత్తిని సాధించి గత రికార్డును తిరగరాసినట్లు తెలిపారు. ఆర్టీపీపీలోని 210 మెగావాట్ల సామర్థ్యం గలిగిన మూడో యూనిట్‌ గతంలో 136 రోజులు నిరంతరాయంగా ఉత్పత్తిని అందించి రికార్డు సృష్టించింది. అయితే ప్రస్తుతం 197 రోజులుగా ఎక్క‌డా ఆగ‌కుండా ఉత్పత్తిని అందిస్తోందన్నారు. 4వ యూనిట్‌ గతంలో వంద రోజులుపాటు నాలుగుసార్లు రికార్డును సృష్టించగా ప్రస్తుతం అయిదో సారి 108 రోజులు నిరంతరాయంగా ఉత్పత్తిని సాధిస్తోందన్నారు. అలాగే యూనిట్‌-5 గతంలో 78 రోజులు నిరంతరాయంగా ఉత్పత్తిని అందించి రికార్డు సృష్టించగా ఈసారి 82 రోజులు రికార్డుస్థాయిలో ఉత్పత్తిని సాధించిందని సీఈ కుమార్‌బాబు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2015 మార్చిలో 717 మిలియన్‌ యూనిట్ల అత్యధిక విద్యుదుత్పత్తిని ఆర్టీపీపీ సాధించిందన్నారు.-పీఆర్‌
First Published:  3 April 2015 9:38 PM GMT
Next Story