ఔటర్ పై ప్రమాదం... మెడికో మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట సమీపంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఔటర్ రింగ్ రోడ్డుపై వైద్య విద్యార్దులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ విద్యార్ధులు రోడ్డుపై పడిపోయారు. ఈ దుర్ఘటనలో ఒక విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన విద్యార్థిని రాజేంద్రనగర్ ప్రాంతం నివాసముండే సల్మాన్‌గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స […]
BY Pragnadhar Reddy3 April 2015 2:51 AM GMT
Pragnadhar Reddy3 April 2015 2:51 AM GMT
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట సమీపంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఔటర్ రింగ్ రోడ్డుపై వైద్య విద్యార్దులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ విద్యార్ధులు రోడ్డుపై పడిపోయారు. ఈ దుర్ఘటనలో ఒక విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన విద్యార్థిని రాజేంద్రనగర్ ప్రాంతం నివాసముండే సల్మాన్‌గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య విద్యార్ధులు సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాల విద్యార్థులని తెలిసింది.-పీఆర్
Next Story