Telugu Global
NEWS

రెండు చోట్ల‌ కాల్చింది ఒకే రివాల్వ‌ర్‌తోనా?

హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్‌, సూర్యాపేట సంఘ‌ట‌న‌ల‌కు సామ్యం ఉందా? కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌లు పోలీసుల‌కు స‌వాల్ విసురుతున్నాయి. హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్‌లో జ్యోతిష్యుడు నాగ‌రాజుపై కాల్పులు జ‌రిపిందీ… సూర్యాపేట‌లో పోలీసుల‌ను చంపిందీ ఒక‌రేనా? అన్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. పోలీసులు కూడా ఆ కోణంలోనే ద‌ర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట ఘ‌ట‌న‌లో కాల్పులు జ‌రిపిన వ్య‌క్తులు హైద‌రాబాద్ బ‌స్సు ఎక్కార‌ని డ్రైవ‌ర్ చెబుతుండ‌టంతో ఈ అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు మూల కేంద్రం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పిన‌క‌డిమి. […]

హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్‌, సూర్యాపేట సంఘ‌ట‌న‌ల‌కు సామ్యం ఉందా? కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌లు పోలీసుల‌కు స‌వాల్ విసురుతున్నాయి. హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్‌లో జ్యోతిష్యుడు నాగ‌రాజుపై కాల్పులు జ‌రిపిందీ… సూర్యాపేట‌లో పోలీసుల‌ను చంపిందీ ఒక‌రేనా? అన్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. పోలీసులు కూడా ఆ కోణంలోనే ద‌ర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట ఘ‌ట‌న‌లో కాల్పులు జ‌రిపిన వ్య‌క్తులు హైద‌రాబాద్ బ‌స్సు ఎక్కార‌ని డ్రైవ‌ర్ చెబుతుండ‌టంతో ఈ అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు మూల కేంద్రం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పిన‌క‌డిమి. గ‌తంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు అక్క‌డ రెండు కుటుంబాల మ‌ధ్య క‌క్ష‌లు పెంచాయి. ఆ నేప‌థ్యంలోనే గ‌త ఏడాది కృష్ణాజిల్లా పెద్ద అవుట‌ప‌ల్లి ద‌గ్గ‌ర ముగ్గురి హ‌త్య‌కు కార‌ణ‌మైంది. అప్ప‌టి నిందితులు ఢిల్లీకి చెందిన ముఠాను ఉప‌యోగించి హ‌త్య‌లు చేయించారు. ఆ ఘ‌ట‌న‌లో జ్యోతిష్యుడు నాగ‌రాజు త‌ప్పించుకున్నాడు. ఇప్పుడు అత‌డిని చంప‌డానికి మ‌ళ్లీ అలాంటి గ్యాంగ్‌నే ర‌ప్పించార‌ని జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం స‌రూర్ న‌గ‌ర్‌లో నాగ‌రాజుపై కాల్పులు జ‌రిపిందీ బ‌య‌టి వ్య‌క్తులేన‌ని పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు. వారే హైద‌రాబాద్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఆర్టీసీ బ‌స్సులో వెళ్లారా? ఆర్టీసీ బ‌స్సులో వెళితే త‌నిఖీలు పెద్ద‌గా ఉండ‌వ‌న్న భావ‌న‌తోనే ఆ బ‌స్సు ఎక్కారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సూర్యాపేట‌లో అనుకోకుండా సీఐ మొగ‌ల‌య్య త‌నిఖీలు చేయ‌డం, త‌మ కోస‌మే వ‌చ్చారేమోన‌న్న అనుమానంతో ముఠా స‌భ్యులు కాల్పులు జ‌రిపారా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పైగా స‌రూర్ న‌గ‌ర్‌లో దొరికిన బుల్లెట్లు, సూర్యాపేట‌లో దొరికిన బుల్లెట్లు ఒకేలా ఉన్నాయ‌ని అధికారులు చెబుతున్నారు. అంటే ఈ రెండు చోట్లా కాల్పులు జ‌రిపింది ఒకే ముఠా స‌భ్యుల‌న్న సంగ‌తి స్ప‌ష్ట‌మ‌వుతోంది.
నిందితులు ఏమ‌య్యారు?
సూర్యాపేట‌లో కాల్పుల నిందితులు ఏమ‌య్యారు?
పారిపోతూ సీఐ గ‌న్‌మెన్ ద‌గ్గ‌రున్న కార్బ‌న్ గ‌న్‌ను కూడా ఎత్తుకెళ్లారు. కార్బ‌న్ గ‌న్ అంటే మామూలు చేతుల్లో ప‌ట్టుకుని తిరిగేది. అంటే దాన్ని దాచ‌డం అంత ఈజీ కాదు. కార్బ‌న్ గ‌న్ పెట్టుకుని వారు జ‌నంలో తిర‌గ‌డం మామూలు విష‌యం కాదు. దీన్ని ఏం చేశార‌న్న విష‌యంతోపాటు వారి ఆచూకీ కోసం 17 బృందాలు గాలిస్తున్నాయి-ఎస్‌
First Published:  3 April 2015 1:18 AM GMT
Next Story