వచ్చే ఆదివారం సీఎంల, హైకోర్టు జడ్జీల సదస్సు
వచ్చే ఆదివారం ఢిల్లీలో దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం జరగనుంది. సమావేశం ప్రారంభ ఉపన్యాసం ప్రధాని నరేంద్ర మోడి ఇస్తారు. దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించేందుకు రెండేళ్ళకోసారి ఈ సమావేశం ఏర్పాటు చేస్తారు. సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు పాల్గొనే ఈ సమావేశంలో న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు కూడా మాట్లాడతారు. కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి సమావేశంలో చర్చిస్తారు. […]
BY Pragnadhar Reddy2 April 2015 10:15 PM GMT
Pragnadhar Reddy2 April 2015 10:15 PM GMT
వచ్చే ఆదివారం ఢిల్లీలో దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం జరగనుంది. సమావేశం ప్రారంభ ఉపన్యాసం ప్రధాని నరేంద్ర మోడి ఇస్తారు. దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించేందుకు రెండేళ్ళకోసారి ఈ సమావేశం ఏర్పాటు చేస్తారు. సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు పాల్గొనే ఈ సమావేశంలో న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు కూడా మాట్లాడతారు. కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి సమావేశంలో చర్చిస్తారు. తాజా సమాచారం ప్రకారం సబార్డినేట్ కోర్టుల్లో 2.64 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండగా హైకోర్టుల్లో 42 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో కేసుల సత్వర పరిష్కారం కోసం అవసరమైన యంత్రాంగాన్ని మెరుగుపరిచేందుకు వచ్చే ఐదేళ్ళలో రూ. 9,749 కోట్లు వెచ్చించాల్సిందిగా 14వ ఆర్థిక సంఘం కూడా సిఫార్సు చేసింది.-పిఆర్
Next Story