Telugu Global
NEWS

రెండు తెలుగు రాష్ట్రాల్లో నాబార్డు కార్యాల‌యాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కార్యాల‌యాలు ఏర్పాటు చేయాల‌ని జాతీయ వ్య‌వ‌సాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) నిర్ణ‌యించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ కార్యాల‌యానికి చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా వి.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌ను, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా జి.జి. మెమ‌న్‌ను నియ‌మించింది. 2015-16 ఆర్థిక సంవ‌త్సరానికి 15,232 కోట్లు రుణాలుగా ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు నాబార్డు నిర్ణ‌యించింది. గ‌త యేడాది రూ. 16 వేల కోట్ల‌కుపైగా రుణాల‌ను నాబార్డు పంపిణీ చేసింది.-పీఆర్‌

First Published:  2 April 2015 12:14 PM GMT
Next Story