వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న విడుదలవుతున్న 'అవును 2'
సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అవును 2’. రవిబాబు దర్శకనిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో పూర్ణ, హర్షవర్ధన్ రాణే హీరో హీరోయిన్లుగా నటించారు. గతంలో రవిబాబు దర్శకత్వంలో విడుదలైన ‘అవును ‘ చిత్రం పెద్ద విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా అవును 2 రూపొందింది. ఈ సినిమా ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఏప్రిల్ 3న విడుదల చేస్తున్నాడు. […]

సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అవును 2’. రవిబాబు దర్శకనిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో పూర్ణ, హర్షవర్ధన్ రాణే హీరో హీరోయిన్లుగా నటించారు. గతంలో రవిబాబు దర్శకత్వంలో విడుదలైన ‘అవును ‘ చిత్రం పెద్ద విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా అవును 2 రూపొందింది. ఈ సినిమా ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఏప్రిల్ 3న విడుదల చేస్తున్నాడు.
ఈ సందర్భంగా…డి. సురేష్ బాబు మాట్లాడుతూ అవును సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకు తెలుసు. అదే క్యారెక్టర్స్ డిఫరెంట్ స్టార్టింగ్‌తో సినిమా రన్ అవుతుంది. ఈ సినిమాలో నిఖిత కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ సినిమాలో సెల్‌కాన్ ట్యాబ్ కీలకపాత్ర పోషిస్తుంది. హర్రర్ సినిమాలను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రాన్ని రవిబాబు చాలా వైవిధ్యంగా తెరకెక్కించారు. పార్ట్ వన్ కంటే ఈ సీక్వెల్ బావుంటుంది. ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమాని వరల్డ్‌వైడ్‌గా ఏప్రిల్3న గ్రాండ్‌లెవల్‌లో విడుదల చేస్తున్నాం అన్నారు.
నిఖిత, సంజన, చక్రవర్తి, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి స్ర్కీన్‌ప్లేః సత్యానంద్, కెమెరాః ఎన్.సుధాకర్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్ః మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ః భూపేష్ ఆర్.భూపతి, రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు.