Telugu Global
WOMEN

వంద కోట్ల పైగా జ‌నాభా...ఒక్క మ‌హిళా డైర‌క్ట‌రూ లేని కంపెనీలు

ఎక్కడైనా, ఏ విష‌యంలోనైనా మార్పు అనేది చ‌ట్టాల వ‌ల్ల త్వ‌ర‌గా వ‌స్తుందా,లేదా మ‌నుషుల మైండ్‌సెట్ మార‌టం వ‌ల‌న త్వ‌ర‌గా వ‌స్తుందా అనే ప్ర‌శ్న‌వేసుకుంటే మైండ్‌సెట్ మార‌ట‌మే ముఖ్య‌మ‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌న‌దేశంలో న‌మోదిత‌ కంపెనీల బోర్డుల్లో క‌నీసం ఒక్క మ‌హిళ అయినా ఉండి తీరాల‌ని సెబీ (సెక్యురిటీస్ ఎక్స్చే్ంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) కొత్త నిబంధ‌న విధించింది. అమ్మాయిలు చ‌దువుల్లో, ఉద్యోగాల్లో అబ్బాయిల‌తో స‌మానంగా రాణిస్తున్నప‌రిస్థితుల్లో కూడా క‌నీసం ఒక్క మ‌హిళ‌యినా డైర‌క్ట‌ర్‌గా లేని కంపెనీలు, నేష‌నల్‌, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌ల ప‌రిధిలో  1500ల‌కు […]

వంద కోట్ల పైగా జ‌నాభా...ఒక్క మ‌హిళా డైర‌క్ట‌రూ లేని  కంపెనీలు
X

ఎక్కడైనా, ఏ విష‌యంలోనైనా మార్పు అనేది చ‌ట్టాల వ‌ల్ల త్వ‌ర‌గా వ‌స్తుందా,లేదా మ‌నుషుల మైండ్‌సెట్ మార‌టం వ‌ల‌న త్వ‌ర‌గా వ‌స్తుందా అనే ప్ర‌శ్న‌వేసుకుంటే మైండ్‌సెట్ మార‌ట‌మే ముఖ్య‌మ‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌న‌దేశంలో న‌మోదిత‌ కంపెనీల బోర్డుల్లో క‌నీసం ఒక్క మ‌హిళ అయినా ఉండి తీరాల‌ని సెబీ (సెక్యురిటీస్ ఎక్స్చే్ంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) కొత్త నిబంధ‌న విధించింది. అమ్మాయిలు చ‌దువుల్లో, ఉద్యోగాల్లో అబ్బాయిల‌తో స‌మానంగా రాణిస్తున్నప‌రిస్థితుల్లో కూడా క‌నీసం ఒక్క మ‌హిళ‌యినా డైర‌క్ట‌ర్‌గా లేని కంపెనీలు, నేష‌నల్‌, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌ల ప‌రిధిలో 1500ల‌కు పైగా ఉన్న‌ట్టుగా లెక్క‌లు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీల యాజ‌మాన్యాలు హ‌డావుడిగా త‌మ ఇళ్ల‌లోంచి భార్య‌ల‌ను, కూతుళ్ల‌ను, సోద‌రీమ‌ణుల‌ను తెచ్చి ఈ స్థానాన్ని భ‌ర్తీ చేస్తున్నాయి. ముఖేష్ అంబానీ త‌మ రిల‌యెన్స్ ఇండ‌స్ర్టీస్‌కి త‌న భార్య‌ నీతా అంబానీని అపాయింట్ చేయ‌గా, రేమాండ్ గ్రూపు అధినేత గౌత‌మ్ సింఘానియా సైతం ఈ స్థానాన్ని తన భార్య న‌వాజ్ సింఘానియాతో భ‌ర్తీ చేశారు. సెబీ ఆదేశాల మేర‌కు ఏప్రిల్ ఒక‌టి ఇందుకు చివ‌రి గడువుతేదీ. సెబీ 13నెల‌ల క్రిత‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నా కంపెనీలు ఆ నిబంధ‌న‌ని పాటించ‌లేక‌పోయాయి. నిబంధ‌న‌ని పాటించ‌ని కంపెనీల‌కు సెబీ రూ.25కోట్ల వ‌ర‌కు అప‌రాధ రుసుము విధించే అవ‌కాశం ఉంది. 100కోట్ల పైనే జ‌నాభా ఉన్న మ‌న‌దేశంలో త‌మ‌కు కావాల్సిన అర్హ‌త‌లున్న మ‌హిళ‌లు ల‌భించ‌లేద‌న‌టం హాస్యాస్ప‌ద‌మ‌వుతుంద‌ని బెంగ‌ళూరులో ఓ కార్పొరేట్ స‌ల‌హా సంఘంలో ప‌నిచేస్తున్న శ్రీరామ్ సుబ్రమ‌ణియ‌న్ అంటున్నారు.

First Published:  1 April 2015 6:33 AM GMT
Next Story