ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు..!
ఏప్రిల్ 12 నుంచి 25 తేదీల మధ్య సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఆడే మ్యాచ్‌ల్లో మార్పులు చేసినట్టు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఏప్రిల్ 18న అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ షేడ్యూలు మార్చాల్సిందిగా కోరిందని, వారి విజ్ఞప్తి మేరకు ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. మారిన షెడ్యూల్ ప్రకారం కోల్‌కతా, చెన్నై మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 14న జరగాల్సిన మ్యాచ్‌ను ఏప్రిల్ 30కు, ఢిల్లీతో […]
BY admin1 April 2015 5:11 AM GMT
admin1 April 2015 5:11 AM GMT
ఏప్రిల్ 12 నుంచి 25 తేదీల మధ్య సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఆడే మ్యాచ్‌ల్లో మార్పులు చేసినట్టు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఏప్రిల్ 18న అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ షేడ్యూలు మార్చాల్సిందిగా కోరిందని, వారి విజ్ఞప్తి మేరకు ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. మారిన షెడ్యూల్ ప్రకారం కోల్‌కతా, చెన్నై మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 14న జరగాల్సిన మ్యాచ్‌ను ఏప్రిల్ 30కు, ఢిల్లీతో మ్యాచ్‌ను ఏప్రిల్ 28 నుంచి మే 7కు మార్పు చేసినట్టు చెప్పారు. దీంతో ఆయా సమయాల్లో జరిగే ఇతర మ్యాచ్‌ల షెడ్యూల్‌లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయని ఠాకూర్ తెలిపారు.-పీఆర్
Next Story