Telugu Global
National

ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.1500 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణానికి బడ్జెటరీ మద్దతుగా రూ.1500 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర పభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం రాత్రి ఈ ప్రకటన జారీ చేసింది. నిజానికి… ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 94(3) ప్రకారం నవ్యాంధ్రలో రాజ్‌భవన్‌, సెక్రట‌రియేట్‌, అసెంబ్లీ, హైకోర్టు తదితర సదుపాయాలకు కేంద్రమే ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా కొత్త రాజధాని నిర్మాణం కోసం ఏపీకి రూ.1500 కోట్లు ఇచ్చేందుకు ఆర్థిక […]

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణానికి బడ్జెటరీ మద్దతుగా రూ.1500 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర పభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం రాత్రి ఈ ప్రకటన జారీ చేసింది. నిజానికి… ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 94(3) ప్రకారం నవ్యాంధ్రలో రాజ్‌భవన్‌, సెక్రట‌రియేట్‌, అసెంబ్లీ, హైకోర్టు తదితర సదుపాయాలకు కేంద్రమే ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా కొత్త రాజధాని నిర్మాణం కోసం ఏపీకి రూ.1500 కోట్లు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అంగీకరించింది.
ఇందులో రూ.వెయ్యి కోట్లను కొత్త రాజధానిలో అవసరమైన మౌలిక‌ సదుపాయాల కల్పన కోసం ఇచ్చేందుకు వీలుగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అవసరమైన అనుమతులు జారీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. మరో రూ.500 కోట్లను కొత్త రాజధానిలో రాజ్‌భవన్‌, సచివాలయం, శానసనభ, హైకోర్టు మొదలైన భవనాల నిర్మాణాలకు కేటాయించినట్లు వివరించింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అప్రూవల్‌ లెటర్‌ పంపించినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. దీన్ని గ‌మ‌నిస్తే… కొత్త రాజధానిలోనే కొత్త హైకోర్టును ఏర్పాటవుతుందని తాజా ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది.-పిఆర్‌
First Published:  31 March 2015 5:48 AM GMT
Next Story