Telugu Global
Sports

ప‌ద్మ‌శ్రీ అవార్డు ఆనందాన్నిచ్చింది: పీవీ సింధు

త‌న‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు రావ‌డం ప‌ట్ల బ్యాడ్మింట‌న్ క్రీడాకార‌ణి  పీవీ సింధు సంతోషం వ్య‌క్తం చేశారు. క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఇలాంటి అవార్డులు చాలా అవ‌స‌ర‌మ‌ని ఆమె అభిప్రాయ‌పడ్డారు. ఈ అవార్డు ఇవ్వ‌డం ద్వారా త‌నపై ఎంతో బాధ్య‌త‌ను పెంచార‌ని సింధూ అన్నారు. ఏదో అవార్డు వ‌చ్చింద‌ని మురిసి పోవ‌డం వ‌ల్ల ఏ మాత్రం ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, మంచి క్రీడాకారిణిగా భార‌త దేశం గ‌ర్వంచే విధంగా రాణించాల‌ని తాను భావిస్తున్న‌ట్టు ఆమె తెలిపారు. ఇపుడున్న ప‌రిస్థితుల్లో అవార్డులు పొంద‌డం […]

ప‌ద్మ‌శ్రీ అవార్డు ఆనందాన్నిచ్చింది: పీవీ సింధు
X

త‌న‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు రావ‌డం ప‌ట్ల బ్యాడ్మింట‌న్ క్రీడాకార‌ణి పీవీ సింధు సంతోషం వ్య‌క్తం చేశారు. క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఇలాంటి అవార్డులు చాలా అవ‌స‌ర‌మ‌ని ఆమె అభిప్రాయ‌పడ్డారు. ఈ అవార్డు ఇవ్వ‌డం ద్వారా త‌నపై ఎంతో బాధ్య‌త‌ను పెంచార‌ని సింధూ అన్నారు. ఏదో అవార్డు వ‌చ్చింద‌ని మురిసి పోవ‌డం వ‌ల్ల ఏ మాత్రం ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, మంచి క్రీడాకారిణిగా భార‌త దేశం గ‌ర్వంచే విధంగా రాణించాల‌ని తాను భావిస్తున్న‌ట్టు ఆమె తెలిపారు. ఇపుడున్న ప‌రిస్థితుల్లో అవార్డులు పొంద‌డం క‌త్తి మీద సామ‌ని, అయినా త‌న‌కు ప‌ద్మ‌శ్రీ తో గుర్తింపు రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని సింధూ తెలిపారు. అమ్మాయిలు క్రీడ‌ల్లో రాణించాలంటే మంచి ప్రోత్సాహ‌కాలు ఉండాల‌ని ఆమె అన్నారు. త‌న‌ను క్రీడాకారిణిగా ప్రోత్స‌హిస్తున్నందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌పంచ నెంబ‌ర్ ఒన్ ర్యాంకు సాధించిన సైనా నెహ్వాల్‌ను అభినందిస్తూ ఎంతో మంది క్రీడాకారుల‌కు ఆమె మార్గ‌ద‌ర్శిగా ఉంటుంద‌ని అన్నారు.-పిఆర్‌

First Published:  30 March 2015 4:34 AM GMT
Next Story