Telugu Global
Cinema & Entertainment

ట్విట్ట‌ర్‌లో అమితాబ్‌కు 1.39 కోట్ల ఫాలోవ‌ర్స్‌!

సోష‌ల్ వెబ్‌సైట్ స‌ద‌ర్శ‌కుల‌తో ఉత్త‌రాది సూప‌ర్‌స్టార్‌, సీని లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్‌కి అరుదైన రికార్డు ద‌క్కింది. ఆయ‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఫాలోవ‌ర్స్‌గా కోటీ 39 ల‌క్ష‌ల మంది చేరి కొత్త రికార్డు నెల‌కొల్పారు. ఆయ‌న త‌ర్వాత స్థానంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌రేంద్ర మోడీ ఉన్నారు. ఇపుడు రెండో స్థానాన్ని మరో సినీ హీరో షారూక్ ఖాన్ త‌న్నుకుపోయారు. ఆయ‌న‌కు ట్విట్ట‌ర్‌లో కోటీ 20 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడి ట్విట్ట‌ర్ […]

ట్విట్ట‌ర్‌లో అమితాబ్‌కు 1.39 కోట్ల ఫాలోవ‌ర్స్‌!
X

సోష‌ల్ వెబ్‌సైట్ స‌ద‌ర్శ‌కుల‌తో ఉత్త‌రాది సూప‌ర్‌స్టార్‌, సీని లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్‌కి అరుదైన రికార్డు ద‌క్కింది. ఆయ‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఫాలోవ‌ర్స్‌గా కోటీ 39 ల‌క్ష‌ల మంది చేరి కొత్త రికార్డు నెల‌కొల్పారు. ఆయ‌న త‌ర్వాత స్థానంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌రేంద్ర మోడీ ఉన్నారు. ఇపుడు రెండో స్థానాన్ని మరో సినీ హీరో షారూక్ ఖాన్ త‌న్నుకుపోయారు. ఆయ‌న‌కు ట్విట్ట‌ర్‌లో కోటీ 20 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడి ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్స్‌లో మూడో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈయ‌న‌కున్న ఫాలోవ‌ర్స్ కోటీ 11 ల‌క్ష‌లు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.-పిఆర్‌

First Published:  30 March 2015 6:46 AM GMT
Next Story