Telugu Global
National

పిఎస్ఎల్‌వి-సి 27 ప్రయోగం...

పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహిక‌ల్-సి 27 (పిఎస్ఎల్‌వి-సి) విజ‌య‌వంతంగా ప్రయోగించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ (షార్) నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ – సి 27 ఉపగ్రహ వాహక నౌక శనివారం సాయంత్రం 5 గంటల 19 నిమిషాలకు నింగిలోకి దూసుకు వెళ్ళింది. ఈ రాకెట్ ద్వారా ఐ.ఆర్.ఎన్.ఎస్.ఎస్. – 1డి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. దీని […]

పిఎస్ఎల్‌వి-సి 27 ప్రయోగం...
X
పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహిక‌ల్-సి 27 (పిఎస్ఎల్‌వి-సి) విజ‌య‌వంతంగా ప్రయోగించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ (షార్) నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ – సి 27 ఉపగ్రహ వాహక నౌక శనివారం సాయంత్రం 5 గంటల 19 నిమిషాలకు నింగిలోకి దూసుకు వెళ్ళింది. ఈ రాకెట్ ద్వారా ఐ.ఆర్.ఎన్.ఎస్.ఎస్. – 1డి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. దీని తయారీకి 125 కోట్ల రూపాయల వ్యయం చేశారు. ఈ ఉప‌గ్ర‌హ‌ ప్రయోగం సఫలమైతే దేశానికి సొంతగా నేవిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఉపగ్రహం ద్వారా 1500 కిలోమీటర్ల పరిధిలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు రాకెట్ ప్రయాణంలో రెండో దశ విజయవంతంగా పూర్తయింది. ఇటీవలే ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్‌కి ఇది తొలి ప్రయోగం… అయినా ఆయ‌న విజ‌య‌ప‌రంప‌ర‌లో తొలిమెట్టు సాధించారు.-పీఆర్‌
First Published:  28 March 2015 10:45 AM GMT
Next Story