Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 15

పేరులో ఏముంది? పెద్దమనిషి : అబ్బాయ్‌! నీ పేరేమిటి? అబ్బాయి : భీముడు పెద్దమనిషి : ఐతే నువ్వెందుకు సన్నగా వున్నావ్‌? అబ్బాయ్‌ : మీ పేరేమిటి? పెద్దమనిషి : హనుమంతరావు అబ్బాయ్‌ : ఐతే మీకు తోక లేదే? ************ సర్కస్‌ రాజు : నువ్వు సర్కస్‌కు వెళ్లవా ? రవి : వెళ్లను రాజు : ఎందుకు? రవి : మా యిల్లే పెద్ద సర్కస్‌ ************ మహాతల్లి బిచ్చగాడు : అమ్మా! అంత […]

పేరులో ఏముంది?
పెద్దమనిషి : అబ్బాయ్‌! నీ పేరేమిటి?
అబ్బాయి : భీముడు
పెద్దమనిషి : ఐతే నువ్వెందుకు సన్నగా వున్నావ్‌?
అబ్బాయ్‌ : మీ పేరేమిటి?
పెద్దమనిషి : హనుమంతరావు
అబ్బాయ్‌ : ఐతే మీకు తోక లేదే?
************
సర్కస్‌
రాజు : నువ్వు సర్కస్‌కు వెళ్లవా ?
రవి : వెళ్లను
రాజు : ఎందుకు?
రవి : మా యిల్లే పెద్ద సర్కస్‌
************
మహాతల్లి
బిచ్చగాడు : అమ్మా! అంత అన్నం పెట్టండి
ఆవిడ : అన్నం చల్లగా వుంటుంది, ఫరవాలేదా?
బిచ్చగాడు : ఫరవా లేదు తల్లీ!
ఆవిడ : ఐతే రేపురా! ఈ రోజు మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టి రేపు యిస్తా!
************
అతి తెలివి
టీచర్‌ : నాలుగు కాళ్ల జంతువుకు ఒక ఉదాహరణ ఇవ్వు
విద్యార్థి : గుర్రం
టీచర్‌ : వెరీగుడ్‌! యింకో ఉదాహరణ?
విద్యార్థి : ఇంకో గుర్రం!

First Published:  27 March 2015 7:00 PM GMT
Next Story