Telugu Global
NEWS

ఇంట్లో తండ్రి శవం... అయినా పరీక్షకు పయనం

ఇంట్లో కన్నతండ్రి శవం.. మరోవైపు సంవత్సరంపాటు చదివిన చదువుకు పరీక్ష. ఈరెండింటికి సమాన ప్రాధాన్యం ఇచ్చాడు ఓ టెన్త్‌ క్లాస్‌ విద్యార్థి. తండ్రి శవం ఇంట్లో ఉండగానే గుండె నిబ్బరం చేసుకుని పదో తరగతి వార్షిక పరీక్షల్లో తెలుగు మొదటి పేపరు పరీక్ష రాశాడు. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలంలో జరిగింది. వివరాలను పరిశీలిస్తే… కుభీర్ జడ్పీ స్కూల్లో ఎన్. ప్రసన్న పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షకు ముందురోజు రాత్రి ఆస్టా గ్రామంలో […]

ఇంట్లో కన్నతండ్రి శవం.. మరోవైపు సంవత్సరంపాటు చదివిన చదువుకు పరీక్ష. ఈరెండింటికి సమాన ప్రాధాన్యం ఇచ్చాడు ఓ టెన్త్‌ క్లాస్‌ విద్యార్థి. తండ్రి శవం ఇంట్లో ఉండగానే గుండె నిబ్బరం చేసుకుని పదో తరగతి వార్షిక పరీక్షల్లో తెలుగు మొదటి పేపరు పరీక్ష రాశాడు. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలంలో జరిగింది. వివరాలను పరిశీలిస్తే… కుభీర్ జడ్పీ స్కూల్లో ఎన్. ప్రసన్న పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షకు ముందురోజు రాత్రి ఆస్టా గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని తండ్రి గజ్జన్న మృతి చెందాడు. రాత్రికి రాత్రే అక్కడికి వెళ్లి తండ్రి మృతదేహాన్ని చూసి తిరిగి ఉదయం కుభీర్‌లో టెన్త్ పరీక్షకు హాజరయ్యాడు. తర్వాత మధ్యాహ్నం తన సొంత ఊరిలో తండ్రి అంత్యక్రియలకు వెళ్లాడు. అంతటి దుఃఖంలోనూ ప్రసన్న పదో తరగతి పరీక్ష రాసి చదువుపై తనకున్న మమకారాన్ని చాటుకున్నాడు. ప్రసన్న సొంత ఊరు ముధోల్ మండలంలోని ఆస్టా గ్రామం. చిన్నప్పటి నుండి కుభీర్‌లోని అమ్మమ్మ వద్దే ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. ప్రసన్నకు 9వ తరగతి చదివే తమ్ముడు, తల్లి ఉన్నారు. ఇంట్లో పెద్ద కుమారుడు కావడంతో చిన్న వయస్సులోనే ప్రసన్నకు ఇలాంటి కష్టం రావడం అందరిని కంటతడి పెట్టించింది. – పి.ఆర్‌.

First Published:  27 March 2015 2:19 AM GMT
Next Story