Telugu Global
Health & Life Style

త్వ‌ర‌లో వీణా-వాణిల ఆపరెషన్ పై నిర్ణయం! 

అవిభక్త కవలలు వీణా – వాణిల ఆపరేషన్‌కు సంబంధించి  స‌వివ‌ర‌మైన నివేదిక‌ను లండన్ వైద్యులు హైద‌రాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి పంపించారు. ఆప‌రేష‌న్‌ను ఎప్పుడు చేపట్టేదీ, ఎన్ని ద‌శ‌ల్లో చేసేది ఈ నివేదిక‌లో వైద్యులు వివ‌రించారు. లండన్ వైద్యుల నుంచి అందుకున్న ఈ రిపోర్టును శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి నిలోఫర్ వైద్యులు అందజేశారు. ఈ మేరకు వీణా – వాణిల ఆపరేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. దాదాపు ఐదు విడతల్లో సర్జరీలు చేయాల్సి […]

త్వ‌ర‌లో వీణా-వాణిల ఆపరెషన్ పై నిర్ణయం! 
X
అవిభక్త కవలలు వీణా – వాణిల ఆపరేషన్‌కు సంబంధించి స‌వివ‌ర‌మైన నివేదిక‌ను లండన్ వైద్యులు హైద‌రాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి పంపించారు. ఆప‌రేష‌న్‌ను ఎప్పుడు చేపట్టేదీ, ఎన్ని ద‌శ‌ల్లో చేసేది ఈ నివేదిక‌లో వైద్యులు వివ‌రించారు. లండన్ వైద్యుల నుంచి అందుకున్న ఈ రిపోర్టును శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి నిలోఫర్ వైద్యులు అందజేశారు. ఈ మేరకు వీణా – వాణిల ఆపరేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. దాదాపు ఐదు విడతల్లో సర్జరీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 9 నుంచి 12 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని లండన్ వైద్యులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. తాము ఇప్పటివరకు రెండుసార్లు అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేశామని, వేరుపడ్డ ఆ నలుగురు కవలలు ఇప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
First Published:  27 March 2015 2:34 AM GMT
Next Story