Telugu Global
Cinema & Entertainment

ఇండియా ఓడిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది-వర్మ

ఆస్ట్రేలియా మధ్య మార్చి 26 జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. దీంతో భారత క్రికెట్ అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే కన్నీరుమున్నీరవుతున్నారు. కానీ…ఒకే ఒక్క భారతీయుడు మాత్రం భారత్ ఓడిపోయినందుకు తనకు చాలా హ్యాపీగా ఉందని ట్విట్ చేశాడు. అతనెవరో కాదు నిత్యం వివాదాలతో తలమునకలయ్యే సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. క్రికెట్ కంటే తాను ఎక్కువగా ఆ క్రీడను అభిమానించేవారిని ద్వేషిస్తారని ఆయన ట్విట్టర్ లో […]

ఇండియా ఓడిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది-వర్మ
X

ఆస్ట్రేలియా మధ్య మార్చి 26 జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. దీంతో భారత క్రికెట్ అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే కన్నీరుమున్నీరవుతున్నారు. కానీ…ఒకే ఒక్క భారతీయుడు మాత్రం భారత్ ఓడిపోయినందుకు తనకు చాలా హ్యాపీగా ఉందని ట్విట్ చేశాడు. అతనెవరో కాదు నిత్యం వివాదాలతో తలమునకలయ్యే సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. క్రికెట్ కంటే తాను ఎక్కువగా ఆ క్రీడను అభిమానించేవారిని ద్వేషిస్తారని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇండియాని ఇలాగే ఓడించండి అంటూ ఇతర క్రికెట్ జట్లకు ఆయన పిలుపు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా “నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే… క్రికెట్‌ను ద్వేషిస్తున్నాను… క్రికెటే వల్ల సామన్య జనం సైతం పనులు మానేసి టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని, ఇది దేశానికి ఎంతో కీడు చేస్తుందని తనదైన శైలిలో కామెంట్లు విసిరాడు.. మద్యపానం, ధూమపానం కంటే ఇది చాలా తీవ్రమైన వ్యసనమని ఆయన ట్వీట్‌ చేశాడు. ఇక చివరగా ‘క్రికెటైటిస్’ అనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి బారి నుంచి నా దేశాన్ని రక్షించాల్సిందిగా దేవుళ్లందరినీ ప్రార్థిస్తానని ట్విట్ చేశాడు. వర్మ స్టయిలే వేరు!

First Published:  26 March 2015 11:44 AM GMT
Next Story