Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 9

అతని వల్లే… లెక్చరర్‌ : క్లాసుకు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? రాధ : ఒకబ్బాయి నన్ను ఫాలో అవుతున్నాడు సార్‌! లెక్చరర్‌ : అందుకని ఆలస్యమయిందా? రాధ : అతను మెల్లగా నడుస్తున్నాడు సార్‌! ************ మంచి భర్త తండ్రి తన పిల్లల్ని పిలిచి ”గతవారం అమ్మ చెప్పినట్లు విని ఎదిరించకుండా అన్ని పనులు చేసిన ఒకరికి ఈ వంద రూపాయలు బహుమతి ఇస్తాను. ఎవరికివ్వాలి?” అన్నాడు. పిల్లలు ”నీకే డాడీ!” అన్నారు. ************ ఫైట్‌ ”హలో! […]

అతని వల్లే…
లెక్చరర్‌ : క్లాసుకు ఎందుకు ఆలస్యంగా వచ్చావు?
రాధ : ఒకబ్బాయి నన్ను ఫాలో అవుతున్నాడు సార్‌!
లెక్చరర్‌ : అందుకని ఆలస్యమయిందా?
రాధ : అతను మెల్లగా నడుస్తున్నాడు సార్‌!
************
మంచి భర్త
తండ్రి తన పిల్లల్ని పిలిచి ”గతవారం అమ్మ చెప్పినట్లు విని ఎదిరించకుండా అన్ని పనులు చేసిన ఒకరికి ఈ వంద రూపాయలు బహుమతి ఇస్తాను. ఎవరికివ్వాలి?” అన్నాడు.
పిల్లలు ”నీకే డాడీ!” అన్నారు.
************
ఫైట్‌
”హలో! పోలీస్‌! మా పక్కింటతను, మా నాన్న పోట్లాడుకుంటున్నారు, అరగంట నించీ. మా నాన్నను పక్కింటతను కొడుతున్నాడు.”
”మరి అరగంటకు ముందే ఫోన్‌ చెయ్యొచ్చు కదా!”
”అప్పుడు మా నాన్న పక్కింటతన్ని కొడుతున్నాడు.
************
” వాళ్లకు అర్థం కాలేదు
జడ్జి దొంగతో : ఏమయ్యా! ఇంతకు ముందు వచ్చినపుడు మళ్లీ నీ ముఖం నాకు చూపించకు అన్నాను కదా! ఎందుకొచ్చావు?
దొంగ : ఆ సంగతే నేను పోలీసులతో చెబితే వాళ్లు వినిపించుకోలేదండీ!
************
అద్దాలు ”నాకు మూడు జతల అద్దాలు కావాలి.”
”మూడెందుకు?” ”ఒకటి దూరంగా ఉన్నవి చూడ్డానికి, రెండోది దగ్గరగా ఉన్నవి చూడ్డానికి.”
”మరి మూడోది.”
”ఆ రెండూ ఎక్కడ ఉన్నాయో చూడ్డానికి.”

First Published:  24 March 2015 7:00 PM GMT
Next Story