Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 10

తేడా గజల్‌కు, లెక్చర్‌కు తేడా ఏమిటి? గర్ల్‌ఫ్రెండ్‌ మాట్లాడిన ప్రతి మాటా గజల్‌! భార్య మాట్లాడిన ప్రతి మాటా లెక్చర్‌! ************ టీచర్‌ టీచర్‌ : ఒకతను చెబుతూ ఉంటాడు. వినే వాళ్లకి ఆసక్తి ఉండదు. అతన్నేమంటారు? స్టూడెంట్స్‌ : టీచర్‌! ************ చూపు టీచర్‌ : మనిషి చూపు బలమైందా? పక్షులు బాగా చూడగలుగుతాయా? వెంకట్‌ : పక్షుల చూపే బలమైంది. టీచర్‌ : ఎందుకు వెంకట్‌ : పక్షులు కళ్ళద్దాలు పెట్టుకోవడం మీరు చూశారా? […]

తేడా
గజల్‌కు, లెక్చర్‌కు తేడా ఏమిటి?
గర్ల్‌ఫ్రెండ్‌ మాట్లాడిన ప్రతి మాటా గజల్‌!
భార్య మాట్లాడిన ప్రతి మాటా లెక్చర్‌!
************
టీచర్‌
టీచర్‌ : ఒకతను చెబుతూ ఉంటాడు. వినే వాళ్లకి ఆసక్తి ఉండదు. అతన్నేమంటారు? స్టూడెంట్స్‌ : టీచర్‌!
************
చూపు
టీచర్‌ : మనిషి చూపు బలమైందా? పక్షులు బాగా చూడగలుగుతాయా?
వెంకట్‌ : పక్షుల చూపే బలమైంది.
టీచర్‌ : ఎందుకు వెంకట్‌ : పక్షులు కళ్ళద్దాలు పెట్టుకోవడం మీరు చూశారా?
************
ఇష్టం
కొత్త కోడలితో అత్తగారు- ”చూడు తల్లీ! నాకు దోసెలు, మీ మామయ్యగారికి ఇడ్లీలు, మీ మరిదికి వడలు, మీ బావగారికి పెసరట్లు, మీ ఆయనకు పూరీలు ఇష్టం, మరి నీకేది ఇష్టం?” అని అడిగింది అత్త.

”వేరు కాపురం” అంది కోడలు

First Published:  25 March 2015 9:00 AM GMT
Next Story